Buckwheat : బక్ వీట్.. గురించి మనలో చాలా మందికి తెలియదు. మంచి రుచి కలిగిన ఈ బక్ వీట్ పిండి ఒక పండు విత్తనాల నుండి తయారుచేస్తారు. సాధారణమైన గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా ఈ పిండి వాడతారు. బక్ వీట్ పిండి సూపర్ మార్కెట్ లో లభ్యం అవుతుంది. దీని ధర కేవలం 150 రూపాయలలోపు ఉంటుంది. గోధుమలను పుల్కాల రూపంలో గాని లేదా అన్నం రూపంలో గాని తీసుకున్నప్పుడు డయాబెటిస్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కానీ బక్ వీట్ ని గోధుమలకు ప్రత్యామ్నాయంగా వాడతారు. ఈ బక్ వీట్ ని పిండి చేసుకొని రొట్టెలు, దోశలు వంటి వాటిని చేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బక్ వీట్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా, గ్లూటెన్ రహితంగా ఉంటుంది. బక్ వీట్ తృణధాన్యం కాకపోయినా దీనిని ఒక తృణధాన్యం లాగా చెబుతారు. దీనిలో రుటిన్ అనే ఫైటోన్యూట్రియెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండెకు రక్తప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
ఈ బక్ వీట్ అనేది డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా సహాయపడుతుంది. దీనిలో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చు తగ్గులను నియంత్రిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. దీనిలో 12 రకాల అమైనో ఆమ్లాలు ఉండుట వలన కండరాల దృఢంగా మరియు పెరుగుదలకు సహాయపడుతుంది. సెలీనియం మరియు జింక్ ఉండుట వలన వయస్సు పెరిగే కొద్ది ఎముకలలో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
ఈ బక్ వీట్ లో విటమిన్ ఇ మరియు మెగ్నీషియం ఉండుట వలన ఇవి రెండూ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేసి శ్వాసనాళాలు వాపును తగ్గించి ఆస్తమా నివారణలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యలు దరిచేరనివ్వకుండా చేస్తుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…