Anchor Suma : రెండు దశాబ్దాలుగా అటు బుల్లితెరను ఏలుతూ ఇటీవలే జయమ్మ పంచాయితీ అంటూ మరోసారి వెండితెరలోకి అడుగు పెట్టింది యాంకర్ సుమ కనకాల. అటు టీవీ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటూనే సినిమా ఈవెంట్స్ కి హోస్ట్ చేస్తుంటుంది సుమ. సుమ సినిమా ఈవెంట్‌ని హోస్ట్ చేస్తుందంటే ఆ సందడే వేరు. అందరినీ ఈవెంట్ లో భాగస్వామ్యం చేస్తూ.. కడుపుబ్బా నవ్విస్తుంది. ఒక రకంగా సుమ కోసమే కొందరు ఈవెంట్ చూస్తారు అంటే నమ్మశక్యం కాదు. ఏళ్లకి ఏళ్లుగా ఇండస్ట్రీలో వన్ అండ్ ఓన్లీ బిగ్ ఈవెంట్ హోస్ట్ కావడంతో టాప్ దర్శకులు, బడా నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం సుమ యాంకరింగ్‌ని ఇష్టపడతారు.
ఇంకా చెప్పాలంటే సుమ హోస్టింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఎక్కడికక్కడ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటూ చెరగని ముద్ర వేయించుకుంది యాంకర్ సుమ. అయితే త్వరలోనే సుమ సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమెకు ఏమైంది.. ఆమె ఎందుకు దూరం కావాలనుకుంటుంది.. అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో సుమ ఆరోగ్యం కొంచెం ట్రబుల్ ఇస్తుందట. తెరపై చలాకీగా మాట్లాడుతున్నా, గలగలా నవ్వుతూ యాంకరింగ్ చేస్తున్నా.. ఇన్నర్ గా ఆమె ఆరోగ్యం బాగోలేదట.
ఆమె ఆడవాళ్లకు సంబంధించిన ఓ ప్రాబ్లంతో బాధపడుతుందని ఓ న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు దీని కోసం డాక్టర్స్ ఎక్కువసేపు నిలబడకూడదని.. రెస్ట్ తీసుకోవాలని, హడావిడిగా టెన్షన్ పడుతూ అటు ఇటు తిరగకూడదని.. ఆమెకు సూచించారట. అలా ఆమె ఇప్పటి నుంచి తన ఆరోగ్యంపై దృష్టి పెడితే భవిష్యత్తులో ఈ ప్రాబ్లం కొంచెం తగ్గే అవకాశం ఉన్నట్లు డాక్టర్ చెప్పారట. దీంతో ఇప్పటి వరకు కమిట్ అయిన షూటింగ్స్ ఈవెంట్స్ కు యాంకరింగ్ చేసి.. ఆ తర్వాత తన యాంకరింగ్ లైఫ్ కి గుడ్ బై చెప్పాలని భావిస్తుందట. మరి ఈ వార్తలో నిజం ఎంతుందో సుమ నోరు విప్పితేగానీ తెలీదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…