Mokshagna : నట సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఇప్పటి వరకు అఫిషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. ఇప్పటికే అక్కినేని, మెగా, అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల నుంచి నట వారసులు వచ్చి స్టార్ హీరోలుగా సత్తా చాటుతున్నారు. ఆ జనరేషన్ వారిలో బాలయ్య ఒక్కడే ఇప్పుడు హీరోగా కొనసాగుతున్నారు. బాలయ్య తర్వాత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా తమకంటూ ఓ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకున్నారు.
అయితే బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ మాత్రం ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై ఒక్కోసారి ఒక్కో విధంగా స్పందిస్తున్నాడు బాలయ్య. అయితే ఆదిత్య 369 సీక్వెల్ ను మోక్షజ్ఞతో తెరకెక్కిస్తానని.. కుదిరితే దానికి నేనే దర్శకత్వం వహిస్తానని ఇటీవల బాలయ్య అన్నాడు. కానీ తర్వాత ఎప్పటిలాగే క్రిష్, బోయపాటి, కొరటాల, రాజమౌళి పేర్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం మోక్షజ్ఞలో హీరోకి ఉండాల్సిన లుక్ కనిపించడం లేదు. ఆ మధ్యన బర్త్ డే వేడుకల సందర్భంగా మోక్షజ్ఞ పిక్స్ వైరల్ అయ్యాయి. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని టర్కీ షెడ్యూల్ పూర్తయింది.
ఈ సందర్భంగా మోక్షజ్ఞ పిక్ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఫ్యామిలీ, బాలకృష్ణ, వసుంధర, మోక్షజ్ఞ ఉన్నారు. మోక్షజ్ఞ వైట్ షర్ట్ ధరించి కనిపిస్తున్నాడు. మోక్షజ్ఞ బాడీలో ఇంకా ఫిట్ నెస్ కనిపించకపోవడంతో నందమూరి అభిమానులు తీవ్రంగా నిరాశకు గురవుతున్నారు. అయితే బాలయ్య 107వ చిత్రం షూటింగ్స్ లో మోక్షజ్ఞ ఇన్వాల్వ్ అవుతుండడం, సెట్స్ కి వెళుతుండడం కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇలా దగ్గరుండి బాలయ్య నటనలో మెళుకువలు నేర్పుతున్నాడేమో. దీనిపై త్వరలో బాలయ్య అధికారిక ప్రకటన చేస్తే కానీ అభిమానులకు ఓ క్లారిటీ వచ్చేలా లేదు. బాలకృష్ణ.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…