Bandla Ganesh : వివాదాస్పద కామెంట్లు చేయడంలో బండ్ల గణేష్ అందరి కన్నా ఒక మెట్టుపైనే ఉంటారు. ఆయన చేసే కామెంట్స్ తరచూ వివాదాలకు కారణమవుతుంటాయి. ఆయన ఒక సినిమా ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ ను బాధ పెట్టేలా కామెంట్లు చేశారు. దీంతో అప్పట్లో గణేష్ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆ సమయంలో బండ్ల గణేష్ కామెంట్లకు పూరీ జగన్నాథ్ నుంచి ఘాటైన కౌంటర్ వచ్చింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరీ జగన్నాథ్ పై బండ్ల గణేష్ మరోమారు షాకింగ్ కామెంట్లు చేశారు. దీంతో మళ్లీ ఆయన వార్తల్లో నిలిచారు.
బండ్ల గణేష్ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భార్యా బిడ్డలను ప్రేమించనోడు మనిషా అంటూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయాలను ఎందుకు కెలుకుతున్నారనే ప్రశ్నకు.. బండ్ల.. ఎక్కడ కెలికానని సమాధానమిచ్చారు. ఇక పూరీ జగన్నాథ్ అనే వ్యక్తికి మంచి, చెడు చెప్పే హక్కు నాకు ఉందని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు. పూరీ జగన్నాథ్ నా ఫ్రెండ్ అని బండ్ల గణేష్ వెల్లడించారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
అయితే పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో బండ్ల గణేష్ నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కాయి. ఈ కాంబినేషన్ లో వచ్చిన ఇద్దరమ్మాయిలతో మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సాధించలేదు. కానీ టెంపర్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత బండ్ల గణేష్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా బండ్ల గణేష్.. పూరీ జగన్నాథ్ పై చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. మరి దీనికి పూరీ మళ్లీ స్పందిస్తారేమో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…