Boda Kakarakaya : కూరగాయలల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడకాకర లేదా ఆగాకరకాయ పోషకాల గని అని చెప్పవచ్చు. కాకర జాతికి చెందినవే ఆకాకరకాయలు. వర్షాకాలంలో ఇవి విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో ఉన్నాయి. బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి.
బోడ కాకరను సాధారణ కూరగాయగానే కాకుండా దీని వేర్లు, పువ్వులు, రసం, ఆకులను కూడా అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఆగాకరకాయలలో కేలరీలు తక్కువగా ఉండుట వలన అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. బోడ కాకరకాయలను తినడం వలన గ్యాస్ట్రిక్ అల్సర్, పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు (బీపీ) నియంత్రణలో ఉండేలా చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆగాకరకాయలలోని కెరోటినాయిడ్లు కంటికి సంబంధించిన సమస్యలను రాకుండా చేస్తాయి.
గర్భిణీలు వీటిని కూరగా చేసుకొని తింటే గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అలాగే బోడ కాకర కిడ్నీల్లో రాళ్లకు చెక్ పెడుతుంది. అధిక చెమటను తగ్గిస్తుంది. బోడకాకర దగ్గుకు మంచి మెడిసిన్. బోడ కాకరలో విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, అమైనో ఆమ్లాలు, జింక్, పొటాషియం, భాస్వరం మరియు సోడియం పుష్కలంగా ఉన్నాయి. వీటిలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను తగ్గిస్తాయి. కాబట్టి ఈ ఆగాకరకాయలను దొరికినప్పుడే మిస్ కాకుండా తినండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…