Karthikeya 2 : చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ 2 ఎవరూ ఊహించని విధంగా హీరో నిఖిల్ కెరీర్ లోనే అతి భారీ విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. ఎంతో వేగంగా రూ.100 కోట్ల వసూళ్ల మైలురాయిని కూడా దాటేసింది. అభిషేక్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ లు హీరో హారోయిన్లుగా నటించగా చందూ మొండేటి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రత్యేక పాత్రలో నటించి మెప్పించారు. ఆయన కారెక్టర్ ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీ కృష్ణుడి కాలానికి చెందిన ఒక రహస్యాన్ని ఛేదించే క్రమంలో కథానాయకుడు చేసిన సాహసాలు అందరినీ అబ్బుర పరుస్తాయి. ద్వాపర యుగంలో శ్రీ కృష్ణుడికి చెందినదిగా భావించే ఒక అమూల్యమైన సంపదను కాపాడటానికి హీరో బయలుదేరతాడు. అది కలియుగంలో మానవులకు దిక్సూచిగా చెప్పబడుతుంది. ఈ క్రమంలో అతనికి ఎన్నో దుష్ట శక్తులు ఎదురవుతాయి. ఈ ప్రయాణంలో అతను శ్రీ కృష్ణుడి గొప్పదనాన్ని కూడా తెలుసుకుంటాడు.
ఇక అన్ని చిత్రాల లాగానే ఈ సినిమా కూడా విడుదలైన 45 రోజుల తరువాత ఓటీటీలోకి రానుంది. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 లో సెప్టెంబర్ 30 నుండి ప్రసారం కానుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.
ఇక ఆగస్టు 13న విడుదలైన కార్తికేయ 2 చిత్రం నిఖిల్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఇది ఆయన సినీ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎన్నో పెద్ద సినిమాలు వచ్చినప్పటికీ ఈ చిత్రం ముందు నిలవలేకపోవడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా రూ.120 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకా చాలా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…