Sri Reddy : తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో వార్తల్లో నిలిచింది. పవన్ కల్యాణ్‌ను దూషించి వార్తల్లోకి ఎక్కింది. ఆ తరువాత ఈమెకు పెద్దగా సపోర్ట్ లభించలేదు. దీంతోపాటు తెలుగులో అవకాశాలు కూడా రాలేదు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది. అక్కడి నుంచే ఆమె సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది. అలాగే తన యూట్యూబ్ చానల్‌లో రకరకాల వంటల వీడియోలను అప్‌లోడ్ చేస్తూ అలరిస్తోంది.
శ్రీరెడ్డి ఇప్పటికే తన యూట్యూబ్ చానల్‌లో ఎన్నో రకాల వంటలకు చెందిన వీడియోలను పోస్ట్ చేసింది. తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ.. పలు రకాల వంటకాలను వండుతూ ఆకట్టుకుంటోంది. అయితే శ్రీరెడ్డి తాజాగా తన ఇంటి టూర్‌కు చెందిన వీడియోను పోస్ట్ చేసింది. తన ఇంట్లోని గదులను చూపిస్తూ ఒక్కో గదిలోని ప్రత్యేకతలను వివరించింది. పలు రకాల సదుపాయాలను తాను తన ఇంట్లో ఎలా అమర్చుకున్నది వివరించింది. ఈ క్రమంలోనే తన ఇంటి టూర్‌కు చెందిన వీడియోను ఆమె పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది.
ఇక శ్రీరెడ్డి ఇటీవలి కాలంలో పెద్దగా స్పందించడం లేదు. గతంలో టాలీవుడ్‌కు చెందిన వారిపై విరుచుకు పడేది. కానీ ఈమధ్య అలా మాట్లాడడం కాస్త తగ్గించింది. తన పనేంటో తాను చూసుకుంటూ బిజీగా ఉంటోంది. చికెన్, మటన్, చేపలు తదితర వంటలను వండుతూ.. మధ్య మధ్యలో రెస్టారెంట్లకు వెళ్లి ఫుడ్‌ను తిని వాటికి రేటింగ్స్ ఇస్తూ.. కాలక్షేపం చేస్తోంది. ఇక శ్రీరెడ్డి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఉండదనే అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…