Ajay Bhupathi : ఆర్ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అజయ్ రెండో సినిమాగా మహా సముద్రం చేశాడు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, అనుఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 14న విడుదలైంది.
మహా సముద్రం చిత్రంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న అజయ్ భూపతికి నిరాశే ఎదురైంది. ‘మహా సముద్రం’ ఒక వయొలెంట్ లవ్‌స్టోరీ. ఎమోషనల్‌గా సాగే ప్రేమకథ. ఈ సినిమాకు స్టోరీనే హీరో. అక్టోబర్ 14న తెలుగు సినిమా ఇండస్ట్రీ మరో బ్లాక్‌బస్టర్ మూవీని చూడబోతుంది. ఇది రాసుకోండి.. అంటూ సినిమా రిలీజ్‌కి ముందు తెగ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు అజయ్. కానీ మూవీ నిరాశపరచడంతో సైలెంట్ అయిపోయాడు.
https://twitter.com/DirAjayBhupathi/status/1453617487140962309
మహా సముద్రం చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బలం లేని కథ, కథనం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమా థియేటర్లకు ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇదే విషయమై ఓ అభిమాని ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశాడు. ‘మహా సముద్రం సినిమాను ఏంటి అన్న అలా తీశావు. చాలా ఊహించుకున్నాం’ అని ట్వీట్ చేయగా, దీనికి బదులిచ్చిన అజయ్.. ‘మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు నన్ను క్షమించండి. మరోసారి మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో వస్తా’ అంటూ ట్వీట్ చేశాడు.