Romantic Twitter Review : ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పలు సినిమాల్లో బాలనటుడిగా అలరించాడు. అయితే హీరోగా మాత్రం హిట్ సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే తాజాగా రొమాంటిక్ మూవీ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ మూవీని చూసిన ప్రేక్షకులు బాగుందని ట్విట్టర్‌లో కామెంట్లు చేస్తున్నారు.
రొమాంటిక్ మూవీకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. అయితే నిర్మాణ బాధ్యతలను మాత్రం పూరీ జగన్నాథ్ స్వయంగా దగ్గరుండి మరీ చూసుకున్నారు. ఈ క్రమంలోనే రొమాంటిక్ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేశారు.
Can watch #Romantic 3 times for @ActorAkashPuri, 3 times for #Ketikasharma & 1 time for the entire team 🥳 Loved it ❤@purijagan @Charmmeofficial #AnilPaduri #SunilKashyap @PuriConnects #RomanticOnOCT29th pic.twitter.com/gKjjOdUBTe
— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021
మరోవైపు తాజాగా సెలబ్రిటీల కోసం ఓ ప్రీమియర్ షో వేయగా.. ఎస్ఎస్ రాజమౌళి ఈ మూవీని చూసి అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. దీంతో రొమాంటిక్ మూవీకి బూస్టింగ్ లభించినట్లయింది. ఇక ఈ మూవీకి ప్రస్తుతం పాజిటివ్‌గానే రెస్పాన్స్ వస్తోంది.
Just watched #romantic
Thoroughly enjoyed it!🙂
@ActorAkashPuri killed it!👏👏#Ketikasharma did a great job, welcome to TFI!
Wishing the entire team all the very best!#RomanticOnOCT29th pic.twitter.com/Hhd2YrUYo4— Teja Sajja (@tejasajja123) October 27, 2021
రొమాంటిక్ మూవీలో ఆకాష్ పూరీ సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటించింది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై చార్మి, పూరీ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇందులో ప్రముఖ నటి రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారు.