Sarangadariya : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాలోని సారంగదరియా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ టైంలోనే ‘సారంగదరియా’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిన విషయమే. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదాన్ని.. సింగర్ మంగ్లీ పాడింది.
సారంగదరియా పాటకు సాయిపల్లవి తన డాన్స్ స్టెప్పులతో అదరగొట్టింది. ఈ పాటకు శేఖర్ మాస్టర్, అనీ మాస్టర్ కలిసి కొరియోగ్రఫీ చేసిన సంగతి తెలిసిందే. అయితే సారంగదరియా పాటకు శేఖర్ మాస్టర్ కూతురు సాహితి డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను షేర్ చేసిన శేఖర్ మాస్టర్.. ‘డాన్స్ దరియా ఛాలెంజ్’.. ‘మీరు కూడా మీ వర్షన్‌లో డ్యాన్స్ దరియాను చేసి మాకు పంపించండి. బాగా చేసిన వారిలోంచి ఐదుగురికి ఆహా నుంచి స్మార్ట్ ఫోన్లు లభిస్తాయని’ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
https://www.instagram.com/reel/CVho6AOgCiC/?utm_source=ig_web_copy_link
సారంగదరియా పాట ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలైన నెల రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్సిన సారంగ దరియా పాట.. అతి తక్కువ కాలంలోనే 25 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించిన సంగతి తెలిసిందే. దక్షిణాదిలో మరే లిరికల్ వీడియో సాంగ్‌కు సాధ్యంకాని రికార్డును ఈ పాట దక్కించుకుంది.