Vakkayalu : ఇప్పుడు చాలా మంది పట్టణాలు, నగరాల్లోనే జీవిస్తున్నారు కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పండ్ల గురించి చాలా మందికి పూర్తిగా తెలియదు. అనేక రకాల పండ్లను చాలా మంది చూసి ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో లభించే కొన్ని రకాల పండ్లను ఇప్పటికీ చాలా మంది చూసి ఉండరు. అలాంటి పండ్లలో వాక్కాయలు కూడా ఒకటి. ఇవి పండినా కూడా వీటిని వాక్కాయలనే పిలుస్తారు. ఇక వాక్కాయల గురించి అడిగితే మన పెద్దలు చక్కగా చెబుతారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్కువ పండుతాయి. ఈ కాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా లభిస్తాయి. కొందరు పచ్చిగా ఉన్న ఈ కాయలను తీసుకుని పచ్చడి పెట్టుకుంటారు. ఇక ఈ కాయలను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వాక్కాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఈ కాయలను తింటే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం ఉండవు. అలాగే మలబద్దకం కూడా తగ్గుతుంది. ఈ కాయలలో ఫ్లేవనాయిడ్స్, ఫైబర్, ఫైటో న్యూట్రియెంట్స్, ఆంథోసయనిన్స్, ఫినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఈ కాయలను తింటే కణాలు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. దీంతో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ కాయలను తింటే కిడ్నీల్లోని రాళ్లు సైతం కరిగిపోతాయి.

ఇక ఇవి రుచికి పులుపుగా, వగరుగా ఉంటాయి. కానీ వీటిని తింటే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కాయలను తిడం వల్ల విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కాయల్లో అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ కాయలను తింటే రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే ఈ కాయలను తినడం వల్ల చర్మ వ్యాధులు సైతం తగ్గిపోతాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
దంతాలు, చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య ఉన్నవారు వాక్కాయలను తినడం మంచిది. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ కాయలను తింటే మెదడు యాక్టివ్‌గా మారుతుంది. దీంతో మతిమరుపు తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. అలాగే దంతాలు పుచ్చిపోకుండా ఇవి రక్షిస్తాయి. వాక్కాయాలను తినడం వల్ల ఊపిరితిత్తుతుల శుభ్రమవుతాయి. దీంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఈ కాయలను తినడం వల్ల శరీరంలో సెరటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీన్ని హ్యాప్పీ హార్మోన్ అంటారు. అందువల్ల వాక్కాయలను తింటే మన మూడ్ మారుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. డిప్రెషన్ నుంచి బయట పడతారు. మైండ్ రిలాక్స్ అవుతుంది. మనస్సు ప్రశాంతంగా మారి రాత్రిపూట చక్కగా నిద్ర పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడతారు.
ఇలా వాక్కాయలను తినడం వల్ల మనం అనేక లాభాలను పొందవచ్చు. అయితే ఇవి కొందరికి అలర్జీలను కలగజేస్తాయి. వీటిని తింటే చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొందరికి పొట్టలో అసౌకర్యం కూడా ఏర్పడవచ్చు. కనుక వీటిని తినేముందు జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అలర్జీలు ఉన్నవారు ఈ కాయలను తినకపోవడమే మంచిది.