Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనాలు అందరూ చల్లని మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే మనకు కేవలం ఈ సీజన్‌లోనే లభించే పండ్లలో మామిడి పండు కూడా ఒకటి. దీన్ని తినేందుకు అందరూ ఇష్టం చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే మనకు అనేక రకాల మామిడి పండ్ల వెరైటీలు సైతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అయితే మామిడి పండ్లను తినడం వరకు బాగానే ఉంటుంది. కానీ వీటిని కొన్ని ఆహారాలతో మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ కలిపి తినరాదు. తింటే లేని పోని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక మామిడి పండ్లను వేటితో కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఐస్ క్రీమ్‌తో కలిపి తినరాదు. మామిడి పండు వేడి చేసే స్వభావం కలది. ఐస్ క్రీమ్ చలువ చేస్తుంది. విరుద్ధ స్వభావాలు ఉండే వీటిని కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనుక వీటిని కలిపి తినరాదు. గ్యాప్ ఇచ్చి తినాలి. అలాగే నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లతోనూ మామిడి పండ్లను కలిపి తినరాదు. తింటే జీర్ణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి.

ఇక మామిడి పండ్లను పెరుగుతో కలిపి తినరాదు. ఇవి భిన్న స్వభావాలు కలవి. కనుక వీటిని కూడా కలిపి తినరాదు. అలాగే భోజనం చేసిన వెంటనే ఈ పండ్లను తినరాదు. గ్యాప్ ఇచ్చి తినాలి. కూల్ డ్రింక్‌లతోనూ వీటిని కలిపి తీసుకోరాదు. మామిడి పండ్లను తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి మాత్రమే తినాలి. అలాగే వీటిని కొని తెచ్చిన వెంటనే వీలైనంత త్వరగా తినేయాలి.