Weight Loss : నిత్యం మనం తినే ఆహార పదార్థాల వల్ల మన శరీరానికి కొన్ని క్యాలరీలు శక్తి రూపంలో అందుతాయని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తింటే అధిక బరువు పెరుగుతారు. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తింటే స్లిమ్‌గా ఉంటారు. అయితే మరి చాలా తక్కువ క్యాలరీలు ఏ ఆహారంలో ఉంటాయో తెలుసా..? ఎలాంటి ఆహార పదార్థాలను తింటే చాలా తక్కువ క్యాలరీలు అందుతాయో, దాని వల్ల మనకు ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కింద ఇచ్చిన ఆహార పదార్థాలన్నింటిలోనూ 100 గ్రాముల మోతాదు తీసుకుంటే వాటి ద్వారా మనకు లభించేవి కేవలం 40 క్యాలరీలు మాత్రమే. ఆ ఆహార పదార్థాలు ఏమిటంటే..
100 గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే మనకు లభించేవి కేవలం 33 క్యాలరీలు మాత్రమే. వీటి వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. క్యాలరీలు తక్కువగా లభిస్తాయి కాబట్టి, శరీరం తన పనుల కోసం కొవ్వును కరిగించుకుంటుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో బరువు ఎఫెక్టివ్‌గా తగ్గుతారు. రెడ్ బెల్ పెప్పర్ ను100 గ్రాములు తింటే మనకు అందేవి 31 క్యాలరీలు మాత్రమే. వీటి ద్వారా కూడా మనం అధిక బరువు తగ్గవచ్చు. అయితే వీటి వల్ల మనకు కలిగే ఇంకో అదనపు లాభం ఏమిటంటే.. మనకు రోజువారీ కావల్సిన విటమిన్ సి మోతాదు వీటి ద్వారా 200 శాతం వరకు అందుతుంది.
ఒక కప్పు పాప్ కార్న్ తినడం వల్ల మనకు లభించేవి 32 క్యాలరీలు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు చిరుతిండి, నూనె పదార్థాలు, స్వీట్లు తినేబదులు ఒక కప్పు పాప్ కార్న్ తినండి. దీంతో చాలా సేపటి వరకు ఆకలి వేయదు. బరువు కూడా తగ్గుతారు. ఒక్క మీడియం సైజ్ పుట్ట గొడుగు తింటే మనకు కేవలం 4 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. పైగా వీటిని తక్కువగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. చాలా సేపటి వరకు ఆకలి వేయదు. దీంతో బరువు ఎఫెక్టివ్‌గా తగ్గుతారు. ఆకలిగా ఉన్నప్పుడు ఒక కప్పు గ్రీన్ టీ తాగండి. దీని వల్ల మనకు లభించే క్యాలరీలు సున్నా. అవును, గ్రీన్ టీతో మన శరీరానికి అస్సలు క్యాలరీలు లభించవు. దీంతోపాటు కడుపు ఫుల్ అయిపోయి ఆకలి వేయదు. బరువు తగ్గుతారు. అయితే గ్రీన్ టీలో చక్కెర, పాలు వంటివి కలపకూడదు. డైరెక్ట్‌గా డికాషన్ రూపంలో తాగితేనే ఈ ఫలితం ఉంటుంది.
నారింజ పండు రూపంలో ఉండే గ్రేప్ ఫ్రూట్‌ను సగం ముక్క తింటే మనకు 37 క్యాలరీలు లభిస్తాయి. దీంతో కడుపు నిండిపోతుంది. చాలా సేపటి వరకు ఆకలి వేయదు. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. కీరదోస సగం ముక్కను తింటే మనకు కేవలం 22 క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. దీంతో కడుపు నిండిన ఫీలింగ్ కలిగి చాలా సేపటి వరకు ఆకలి వేయదు. బరువు తగ్గుతారు. 100 గ్రాముల కాలిఫ్లవర్‌లో 25 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. దీన్ని తింటే త్వరగా కడుపు నిండిపోతుంది. చాలా సేపటి వరకు ఆకలి వేయదు. బరువు త్వరగా తగ్గవచ్చు.
ఒక కప్పు బ్రకోలిలో 34 క్యాలరీలు ఉంటాయి. దీన్నితినడం వల్ల కడుపు చాలా త్వరగా నిండుతుంది. ఆకలి వేయదు. బరువు తగ్గవచ్చు. రోజూ రాత్రి తినే భోజనం కొద్దిగా తగ్గించి అందుకు బదులుగా పైన చెప్పిన ఆహారాలను తింటే చాలు, నెల రోజుల్లోనే మీ శరీరంలో మార్పు వస్తుంది. ఫలితం తప్పక కనిపిస్తుంది. బరువు తగ్గుతారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…