Black Chickpeas : శనగపిండిని మనం ఎన్ని వంటకాల్లో ఉపయోగిస్తామో తెలుసు కదా.. మిర్చీ బజ్జీలు మొదలు కొని పకోడీ, మంచూరియా వంటి అనేక వంటకాల్లో ఉపయోగిస్తుంటాం. కానీ అవన్నీ నూనె పదార్థాలు. వాటితో మనకు ఎలాంటి ప్రయోజనం కలగదు సరికదా ఎప్పుడు దాడి చేద్దామా అని అనారోగ్యాలు పొంచి ఉంటాయి. అయితే శనగపిండితో చేసిన ఆ వంటకాల సంగతి పక్కన పెడితే శనగలను పొట్టు తీయకుండా డైరెక్ట్‌గా అలాగే ఉడకబెట్టో, నానబెట్టో, మొలకల రూపంలోనో తింటే మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.
బాదం పప్పు తెలుసుగా. దాంతో సమానమైన పోషకాలు శనగల్లో లభిస్తాయట. అవును, మీరు విన్నది నిజమే. ఈ క్రమంలో వారానికి కనీసం రెండు, మూడు సార్లైనా శనగలను పైన చెప్పిన విధంగా ఏదో ఒక రూపంలో తీసుకుంటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను తగ్గించి వేస్తుంది. దీంతో గుండె సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నాన్‌వెజ్ తినలేని వారికి శనగలను ఒక వరమని చెప్పవచ్చు. ఎందుకంటే మాంసంలో ఉండే ప్రోటీన్లన్నీ శనగలలో లభిస్తాయి.
పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి ఎన్నో రకాల మినరల్స్ శనగల్లో ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి శనగలు బాగా ఉపయోగపడతాయని చెప్పవచ్చు. శనగలను తరచూ తింటుంటే రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో రక్తం బాగా పడుతుంది. ఇది రక్తహీనత ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. శనగల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్, సెరొటోనిన్ వంటి ఉపయోగకరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి. దీంతో నిద్రలేమి దూరమవుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి.
శనగల్లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఐరన్, ప్రోటీన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండడం వల్ల శనగలు శరీరానికి శక్తిని ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు బాగా ఉండడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో మనకు లభిస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎముకలకు పుష్టి కలుగుతుంది.
పాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న ఉప్పును బయటికి పంపుతుంది. కిడ్నీల పనితనం మెరుగు పడుతుంది. పచ్చ కామెర్లు ఉన్న వారు శనగలను తింటే త్వరగా కోలుకుంటారు. మాంగనీస్, పాస్ఫరస్ సమృద్ధిగా ఉండడం వల్ల చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. దురద, గజ్జి వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక శనగలను రోజూ తింటే ఎన్నో విధాలుగా లాభాలు పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…