ఆరోగ్యం

Papaya : బొప్పాయి పండ్ల‌ను వీరు అస్స‌లు తిన‌రాదు.. ఎందుకో తెలుసా..?

Papaya : బొప్పాయి పండు తింటే మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లిపోతాయి. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక డెంగీ వ‌చ్చిన వారు ప్లేట్‌లెట్లు కోల్పోతుంటే బొప్పాయి పండు ద్వారా వాటిని పెంచుకోవ‌చ్చు. ర‌క్తం కూడా పెరుగుతుంది. అయితే బొప్పాయి పండును తినేవారు మాత్రం కింద ఇచ్చిన కొన్ని సూచ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. లేదంటే పండు తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌చ్చు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

గ‌ర్భిణీలు బొప్పాయి పండును ఎట్టి ప‌రిస్థితుల్లో తిన‌కూడ‌దు. ఎందుకంటే ఇందులో ఉండే ప‌లు ర‌సాయ‌నాలు నేరుగా గ‌ర్భాశ‌యంపై ప్ర‌భావం చూపుతాయి. దీంతో అబార్ష‌న్ జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక బొప్పాయి పండును గ‌ర్భిణీలు తిన‌రాదు. మ‌నం తిన్న ఆహారాన్ని నోటి నుంచి జీర్ణాశ‌యానికి అన్న‌వాహిక చేర‌వేస్తుంది. అయితే బొప్పాయి పండు వ‌ల్ల కొంద‌రిలో ఈ అన్న‌వాహిక దెబ్బ తిన‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ పండును బాగా తింటే ఎవరికైనా అన్న వాహిక‌కు ఎఫెక్ట్ అవుతుంది. క‌నుక ఎప్పుడు ఈ పండును తిన్నా ఒక క‌ప్పుకు మించ‌రాదు.

Papaya

గ‌ర్భిణీలే కాదు, పాలిచ్చే త‌ల్లులు కూడా బొప్పాయి పండును తిన‌రాదు. తింటే వారు ఇచ్చే పాల‌తో ప‌లు ర‌సాయ‌నాలు బిడ్డ శ‌రీరంలోకి వెళ్తాయి. దీంతో అవి శిశువుల‌కు లోపాల‌ను క‌లిగిస్తాయి. అనంత‌రం అవి అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయి. క‌నుక పాలిచ్చే త‌ల్లులు కూడా బొప్పాయి పండును తిన‌రాదు. బొప్పాయి పండు కొంద‌రికి ప‌డ‌దు. అల‌ర్జీని క‌లిగిస్తుంది. క‌నుక ఎవ‌రు ఈ పండును తిన్నా ముందుగా ఒక చిన్న ముక్క తిని ఫ‌ర‌వాలేదు అనుకుంటేనే తిన‌డం ఉత్త‌మం. బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు, బీపీ ట్యాబ్లెట్లు వేసుకునే వారు బొప్పాయి పండును తిన‌రాదు. తింటే స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మ‌వుతుంది.

లో బ్ల‌డ్ షుగ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు బొప్పాయి తిన‌రాదు. తింటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు ఇంకా ప‌డిపోతాయి. క‌నుక వారు తిన‌రాదు. బొప్పాయి పండును తినే పురుషులు వాటి విత్త‌నాల‌ను తిన‌కుండా, అవి లోప‌లికి పోకుండా జాగ్ర‌త్త ప‌డాలి. ఎందుకంటే అవి పురుషుల్లో వీర్యాన్ని నాశ‌నం చేస్తాయి. ఇక బొప్పాయి పండును ఎవ‌రైనా చాలా త‌క్కువ‌గా తినాలి. రోజూ తిన‌వ‌చ్చు కానీ ఒక క‌ప్పు మించ‌కూడ‌దు. మించితే శ‌రీరంలో బెంజైల్ ఇసోథ‌యోస‌య‌నేట్ అనే విష ప‌దార్థం పేరుకుపోయి దాంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీయ‌వచ్చు. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా క‌లుగుతుంది. క‌నుక ఈ సూచ‌న‌ల‌ను పాటిస్తూ బొప్పాయి పండ్ల‌ను తినాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM