ఆరోగ్యం

Stamina : మీ శృంగార సామర్థ్యాన్ని పెంచే 14 ఫుడ్ ఐటెమ్స్.. రతిక్రీడలో ఇక మీరే కింగ్స్..!

Stamina : ఒత్తిడి, ఆందోళన, దీర్ఘకాలిక అనారోగ్యాలు.. తదితర కారణాల వల్ల నేడు అనేక మంది స్త్రీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది. దీంతో శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనలేకపోతున్నారు. ఈ క్రమంలో అలాంటి దంపతులకు సంతానం కలిగే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి. అయితే అలాంటి స్త్రీ, పురుషులెవరైనా కింద సూచించిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటుంటే దాంతో వారి లైంగిక సామర్థ్యం పెరగడమే కాదు, సంతానం కూడా త్వరగా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అలాంటి ఆహార పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో అరటి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బి విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా ట్రైప్టోఫాన్, అమైనో యాసిడ్లు కూడా అరటి పండ్లలో ఎక్కువే. ఇవి ఆందోళనను తగ్గించడంతోపాటు మంచి మూడ్‌లోకి తీసుకువచ్చేందుకు ఉపయోగపడతాయి. అరటి పండ్లలో ఉండే పొటాషియం లైంగిక శక్తిని పెంచే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పీన‌ట్ బ‌ట‌ర్‌లో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి డోప‌మైన్ స్థాయిలను పెంచుతాయి. దీంతో మహిళలు శృంగారానికి ఉద్యుక్తులవుతారు. జింక్ ఎక్కువగా ఉండడం వల్ల మగవారిలో లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది.

పింక్ కలర్‌లో కనిపించే బీట్‌రూట్‌ను తినేందుకు చాలా మంది అయిష్టతను ప్రదర్శిస్తారు. కానీ దీన్ని తినడం వల్ల స్త్రీ, పురుషులిద్దరికీ శృంగార పరంగా అనేక లాభాలు కలుగుతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తుంది. నిత్యం ఒక గుప్పెడు ఎర్ర ద్రాక్ష పండ్లను తింటే చాలు. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార పరంగా వచ్చే సమస్యలు పోతాయి. లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండడం వల్ల మగవారిలో వీర్య నాశనం కాకుండా ఉంటుంది. నిత్యం ఒక కప్పు ఓట్ మీల్‌ను తింటే మగవారిలో లైంగిక సామర్థ్యం డబుల్ అవుతుంది. వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది. వారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శృంగార పరంగా ఫిట్ అవుతారు.

శృంగారానికి ముందు దంపతులిద్దరూ ఒక కప్పు కాఫీ తాగితే దాంతో ఒత్తిడి, ఆందోళన మాయమవడమే కాదు, ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారట. అలా అని పలువురు సైంటిస్టులు చేసిన అధ్యయనాలే చెబుతున్నాయి. స్త్రీ, పురుషులిద్దరిలోనూ శృంగార వాంఛను పెంచడంలో కాఫీ తోడ్పడుతుందని తెలిసింది. బీన్స్‌లో ప్రోటీన్స్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీన్స్‌ను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటున్నా స్త్రీ, పురుషులు తమకు కలిగే లైంగిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. నారింజ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్ వంటి నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తింటుంటే దాంతో విటమిన్ సి ఎక్కువగా అందుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గానూ పనిచేస్తుంది. స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.

Stamina

బియ్యాన్ని పాలిష్ చేసి తెల్లగా ఉంటేనే మనం దాన్ని ఎక్కువగా ఇష్ట పడతాం. కానీ అలా కాకుండా ముడి రూపంలో ఉన్న బ్రౌన్ రైస్‌ను తింటే దాంతో శృంగార శక్తి పెరుగుతుంది. ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొన్నా అలసిపోరు. నాడులను ఉత్తేజం చేస్తుంది. యాపిల్ పండ్లలో ఫెనిలెథిలమైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. దీంతో జననావయవాలకు రక్తం బాగా సరఫరా అయి శృంగార వాంఛ కలుగుతుంది. ప్లాంట్ హార్మోన్స్ సోయాబీన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇవి మహిళల్లో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీంతో వారిలో లైంగిక వాంఛ, సామర్థ్యం పెరుగుతాయి. మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది.

శరీరానికి కావల్సిన ఉత్తేజాన్ని, శక్తిని అందించే గుణంతోపాటు డ్రై ఫ్రూట్స్‌కు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం కూడా ఉంది. నిత్యం ఓ గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ను మెనూలో చేర్చుకుంటే దాంతో కీలక విటమిన్సే కాదు, లైంగికంగా మంచి పవర్ కూడా వస్తుంది. గుమ్మడికాయ విత్తనాల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది. ఇది మగవారిలో టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా వారు లైంగికంగా ఎక్కువ పవర్‌ను పొందుతారు. అంతేకాదు మగవారిలో వీర్య నాణ్యత కూడా పెరుగుతుంది. స్త్రీలలో రుతు క్రమం కూడా సరిగ్గా ఉంటుంది. దీంతో సంతానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, మినరల్స్, మాంగనీస్ వంటి కీలక పోషకాలు మొక్కజొన్నలో ఎక్కువగా ఉంటాయి. ఇవి స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. క‌నుక ఈ ఆహారాల‌ను రోజూ తీసుకుంటే మంచిది. దీంతో ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM