Mango Kernel : ఎండాకాలం వస్తుందంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది మామిడికాయ. ఈ మామిడిపండ్లు తియ్యగా, పుల్లగా ఉంటాయి. ఈ పండ్లు తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిని చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారు. అయితే మనం మామిడి పళ్లను తినేటప్పుడు పైన గుజ్జును తిని దాని పిక్కని పడేస్తాం. అయితే ఆ పిక్కతో చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో తెలిస్తే మనం వాటిని ఇకపై పడేయము. అయితే ఆ పిక్కను ఎలా వాడితే ఏం ప్రయోజనాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పిక్కలో ఉన్న జీడిని తీసి పొడిగా తయారుచేసుకొవాలి. ఈ పొడిలో వెన్న కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే ముఖం చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ముఖం అందంగా మారుతుంది. కాంతివంతంగా ఉంటుంది. ఎవరికైనా తెల్ల జుట్టు ఉంటే టెంక పొడిలో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఆవ నూనె కలిపి రాస్తే తెల్ల జుట్టు కాస్తా నల్లగా నిగనిగలాడుతుంది. మామిడి పిక్కలో విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. అందుకే జుట్టుకు పోషణ ఇవ్వడమే కాకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయడంలో సహాయపడతాయి.
ఎవరికైనా జుట్టులో చుండ్రు సమస్య ఉంటే మామిడి పిక్కను పొడి చేసుకొని ఆ పొడిలో నీళ్లు కలిపి పేస్ట్ గా చేసి తల మాడుకు పట్టిస్తే చుండ్రు మటుమాయం అవుతుంది. అధే విధంగా ఎవరికైనా ఆరోగ్య సమస్యలుంటే ఈ పొడిలో తేనె కలిపి ప్రతి రోజు పరగడుపున తాగాలి. అలా చేస్తే ఉబ్బసం, దగ్గు వంటివి దెబ్బకి మాయమవుతాయి. వేసవికాలంలో అందరికీ వేడి చేస్తుంది. ఈ వేడి తగ్గడానికి కూడా ఇది పని చేస్తుంది. మామిడి టెంక పొడి, జీలకర్ర, మెంతుల పొడి మూడింటినీ సమానంగా తీసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వేడి తగ్గుతుంది. ఇలా మామిడి టెంకలతో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…