ఆరోగ్యం

Sweat : చెమ‌ట మ‌రీ ఎక్కువ‌గా వ‌స్తూ.. వాస‌న‌గా ఉంటుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sweat : వేసవిలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టేది చెమట. అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. చెమటతో కొన్ని సందర్భాల్లో నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంటుంది. చెమట వాసనతో నలుగురితో కలవాలంటే జంకు, ఎవరి దగ్గరికైనా వెళ్లాలన్నా భయం కలుగుతుంది. వేసవిలో చిన్నా పెద్దా అందరూ చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే చెమటతో వచ్చే దుర్గంధం నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు డాక్టర్లు.

చంక‌ల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. డియోడరెంట్లకు బదులు సమ్మర్ లో యాంటి పెరిస్పెరెంట్ వాడాలి. ఘాటు వాసన వచ్చే ఆహార పదార్థాలు తినడం మానేయాలి. తేలికపాటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతి అరగంటకు ఒకసారి మంచి నీరు ఎక్కువగా తాగాలి. రెండు పూటలా స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు డెటాల్, యుడుకోలోన్, రోజ్‌వాటర్ వీటిలో ఏదైనా కొన్ని చుక్కలు కలుపుకొని స్నానం చేయాలి. ఎండాకాలంలో కాటన్ దుస్తులనే వాడాలి. అది కూడా పలుచ‌ని బట్టలనే వాడాలి. సింథటిక్ బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇవి చెమటను మరింత ఎక్కువగా వచ్చేలా చేస్తాయి.

చిన్న పసుపు ముక్కను పేస్ట్‌లా రుబ్బుకొని శరీరానికి రాసి స్నానం చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. దుర్వాసన మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి. సగం నిమ్మకాయని తీసుకుని చెమట ఎక్కువగా పట్టే చోట బాగా రుద్దాలి. తరువాత శుభ్రంగా స్నానం చేయాలి. ఇది రోజుకు ఒక్కసారైనా తప్పకుండా చేయాలి. నాలుగు టమాటాలు తీసుకుని పేస్టులా చేసి దాన్ని వడకట్టి జ్యూస్ విడిగా తీయాలి. ఆ జ్యూస్ ని ఒక బకెట్ నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేస్తే శరీర దుర్వాసన తగ్గించుకోవచ్చు. ఇది స్వేద గ్రంథులను ముడుచుకునేలా చేసి తక్కువ చెమట పట్టేలా చేస్తుంది.

కొన్ని పుదీనా ఆకులును ఒక బకెట్ నీటిలో కలిపి స్నానం చేస్తే ఆ రోజంతా చర్మం తాజాగా ఉంటుంది. టేబుల్ స్పూన్ వంట సోడా, టేబుల్ స్పూన్ నిమ్మ రసం కలిపి చంకలలో, ఎక్కువగా చెమట పట్టే చోట్ల‌ రాసుకుని 5 నిముషాల తరువాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా ప్రతి రోజూ చేయాలి. వంట సోడా తేమని ఎక్కువగా పీల్చివేస్తుంది. అది బాక్టీరియాని చంపి శరీర దుర్వాసనని తగ్గిస్తుంది. మీరు స్నానం చేసే నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ నీటితో స్నానం చేస్తే శరీర నుండి వచ్చే చెడు వాసనను నివారించవచ్చు. వీటన్నిటింతోపాటు ఎక్కువగా నీళ్ళు తాగటం, పండ్లను తిన‌డం, చిరుతిండ్లు మానేయ‌డం చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. దీంతో చెమ‌ట‌తోపాటు దానివ‌ల్ల క‌లిగే దుర్వాస‌న నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM