Curd : ప్రతి రోజూ పెరుగును తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. పెరుగు వలన అనేక లాభాలని మనం పొందడానికి వీలవుతుంది. పెరుగును తీసుకుంటే రకరకాల సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా పెరుగు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచుకోవడానికి, వేసవికాలంలో చల్లని ఆహారం తినాలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అయితే పెరుగును తీసుకోవడం వలన శరీరం చల్లగా మారుతుంది.
హైడ్రేటెడ్ గా శరీరం ఉంటుంది. పైగా పెరుగును తీసుకోవడం వలన చాలా సమస్యలు పోతాయి. పెరుగుని కొంచెం చక్కెరలో వేసుకుని తీసుకోవచ్చు. ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడి లేదంటే కూరగాయలతో అయినా తీసుకోవచ్చు. సహజంగా గుండె ఆరోగ్యాన్ని పెరుగు పెంపొందిస్తుంది. పెరుగులో తేనె కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శక్తివంతమైన ఔషధంలా ఇది పనిచేస్తుంది.
ప్రోటీన్స్, క్యాల్షియం పెరుగులో ఎక్కువగా ఉంటాయి. శరీరంలో విటమిన్ డి స్థాయిని పెంచడానికి కూడా పెరుగు సహాయం చేస్తుంది. పెరుగును తీసుకుంటే విటమిన్ డి ని పెంచుకోవచ్చు. ధమనుల్లో అడ్డంకిని పెరుగు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగు, తేనె తీసుకోవడం వలన ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.
ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా పెరుగు తొలగించగలదు. రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పెరుగుని మనం అన్నంతో పాటు తీసుకోవచ్చు. లేదంటే పెరుగుతో చాలా రకాల వంటకాలని కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెరుగు కొలెస్ట్రాల్ ని ఏర్పడకుండా నిరోధిస్తుంది. అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. క్రమం తప్పకుండా పెరుగును తీసుకుంటే, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతాయి. గుండె జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…