ఆరోగ్యం

Warts : ఇలా చేస్తే పులిపిర్లు దెబ్బ‌కు మాయ‌మ‌వుతాయి..!

Warts : అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. నేటి తరుణంలో ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమ అందం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో అనుకోకుండా పులిపిరికాయల్లాంటి చిన్నపాటి పొక్కులు వస్తూ మనల్ని ఇబ్బందులు పెడుతుంటాయి. కానీ ఇవి అంత ప్రమాదమేమీ కాకపోయినా, అందం విషయానికి వస్తే వీటిని తొలగించుకోవడానికి అధిక శాతం మంది ప్రాధాన్యతనిస్తారు. ఈ క్రమంలో సైడ్ ఎఫెక్ట్‌లు కలిగిన ఇంగ్లిష్ మందులను వాడకుండా, సహజ సిద్ధమైన పదార్థాలతో ఆ పొక్కులను ఎలా తొలగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

మెడ, ముఖం వంటి భాగాలపై ఏర్పడే పొక్కులను, పులిపిర్ల‌ను తొలగించడంలో టీ ట్రీ ఆయిల్ బాగా పనిచేస్తుంది. సింపుల్‌గా ఒక కాటన్ బాల్ లాంటి దాన్ని తీసుకుని దాన్ని ఈ ఆయిల్‌లో ముంచి చర్మంపై రాయాలి. అనంతరం దాన్ని ఒక రాత్రి పాటు అలాగే వదిలేయాలి. తెల్లారాక నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే పొక్కులు త్వరగా మాయమవుతాయి. కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని ఆముదంలో కలపాలి. మెత్తని పేస్ట్ వచ్చే వరకు అలా కలుపుతూనే ఉండాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని సంబంధిత చర్మ భాగంపై రాయాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసిన తరువాత కొద్దిగా పిన్ గుచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి చూసి వాడండి.

Warts

చర్మ సంరక్షణకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు నిమ్మలో ఉన్నాయి. కొద్దిగా నిమ్మరసాన్ని సమస్య ఉన్న చర్మ భాగంపై రాసి రాత్రంతా అలాగే వదిలేయాలి. రోజూ ఇలా చేస్తే తప్పక ఫలితం కనిపిస్తుంది. ఓ కాటన్ బాల్‌ను తీసుకుని యాపిల్ సైడర్ వెనిగర్‌లో ముంచి అనంతరం చర్మంపై రాయాలి. కొద్దిగా పిన్‌తో గుచ్చినట్టు అనిపిస్తుంది. కానీ దాని నుంచి వచ్చే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. అరటి తొక్క అని అలా తీసిపారేయకండి. ఎందుకంటే అందులో చర్మాన్ని సంరక్షించే గుణాలు కూడా ఉన్నాయి. ఓ అరటి తొక్కను తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. అనంతరం వాటిని సమస్య ఉన్న చర్మ భాగాలపై పెట్టాలి. రాత్రంతా వాటిని అలాగే వదిలేయాలి. అయితే ఆ ముక్కలు రాలిపోకుండా ఏదైనా గుడ్డ లాంటి దాన్ని వాటిపై కప్పవచ్చు. తరచూ ఇలా చేస్తే పొక్కులను దూరం చేసుకోవచ్చు.

కొద్దిగా ఉల్లిపాయల్ని తీసుకుని ఒక గ్లాస్ ఉప్పు నీటిలో కొంత సేపు నానబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని చర్మ భాగాలపై రాసి, పరిశుభ్రమైన గుడ్డతో కప్పేయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారం రోజుల పాటు ప్రతి రోజు రాత్రి ఇలా చేస్తే త్వరలోనే మీ ముఖం నిగారింపును సొంతం చేసుకుంటుంది. పైనాపిల్ జ్యూస్‌ను సమస్య ఉన్న చర్మ భాగాలపై రాయాలి. కొద్ది రోజుల పాటు ఇలా చేస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM