ముఖ్య‌మైన‌వి

Chanakya : పురుషుల కోసం చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన సూత్రాలు.. వీటిని పాటిస్తే ఇక తిరుగుండదు..!

Chanakya : పూర్వ కాలం నుంచి మనం మన పెద్దలు చెప్పిన ఎన్నో ముఖ్యమైన విషయాలను పాటిస్తూ వస్తున్నాం. వాటిల్లో కొన్ని సైన్స్‌తోనూ ముడిపడి ఉంటాయి. కనుక నేటి తరం వారు కూడా ఇలాంటి అనేక విషయాలను అనుసరిస్తున్నారు. అలాగే ఆచార్య చాణక్యుడు కూడా మన జీవితం సుఖమయంగా సాగేందుకు గాను ఎన్నో నీతి సూత్రాలను చెప్పాడు. ముఖ్యంగా ఆయన పురుషుల కోసం ఎన్నో ధర్య వాక్యాలను చెప్పాడు. వాటిని అనుసరిస్తే ఇక పురుషులకు తిరుగుండదు. వారు తమ జీవితంలో విజయవంతంగా దూసుకెళ్తారు. ఇక చాణక్యుడు పురుషుల కోసం చెప్పిన ఆ ముఖ్యమైన సూత్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషుడు తనను మోసం చేసిన మహిళల దగ్గరకు మళ్లీ వెళ్లకూడదు. వారితో ఎలాంటి రిలేషన్‌షిప్‌ నూ పెట్టుకోకూడదు. పరాయి పురుషుడు లేదా స్త్రీ మిమ్మల్ని అగౌరవపరిచినా.. అమర్యాదగా ప్రవర్తించినా అసలు సహించకూడదు. కూర్చుని ఉన్నప్పుడు ఎవరితోనూ చేతులు కలపరాదు. ఇతరులను ఇంప్రెస్‌ చేసేందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూపించుకోకూడదు. మీకు చెందని ఆహారం చివరి వంతును మీరు తినకూడదు. రోజు రోజుకీ అన్ని విషయాల్లోనూ మరింత మెరుగయ్యేందుకు కృషి చేయండి.

Chanakya

మీకు మర్యాద ఇచ్చేవారు, మీ వెనుక ఉండే వారిని ఎల్లప్పుడూ రక్షించండి. ఎదుటి వారిని ఒక ప్రశ్న అడిగిన తరువాత వారు సమాధానం చెప్పే వరకు వేచి చూడండి. ఇతరులతో బంధాలను పెంచుకునేందుకు వెంపర్లాడరాదు. వారంలో కనీసం 4 రోజులు వ్యాయామం చేయండి. పిలవని కార్యక్రమాలకు వెళ్లకండి. బయటకు వెళ్లినప్పుడు జేబులో ఎల్లప్పుడూ ఎంతో కొంత డబ్బు ఉండేలా చూసుకోండి.

ఎలాంటి సందర్భం అయినా సరే దుస్తులను సరిగ్గా ధరించండి. అసభ్యంగా, అంద విహీనంగా ధరించకండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి కళ్లలో చూసి మాట్లాడండి. వారు ఏమడిగినా వారి కళ్లలోకి చూస్తూ సమాధానం చెప్పండి. అవును, కాదు అని తలూపినా సరే.. వారి కళ్లలోకి చూస్తూ అలా చేయండి. డబ్బు సంపాదించేందుకు కేవలం ఒకే మార్గం కాకుండా ఇతర మార్గాలపై కూడా దృష్టి పెట్టండి. ఇలా చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే పురుషులు ఏ రంగంలో అయినా సరే రాణించగలరు. ఇక వారికి అసలే తిరుగుండదు.

Share
IDL Desk

Recent Posts

Akbar And Birbal : దేవుడు ఎక్క‌డుంటాడు, ఏం చేస్తాడు, ఏం తింటాడు.. అనే ప్ర‌శ్న‌ల‌కు బీర్బ‌ల్ చెప్పిన స‌మాధానాలివే..!

Akbar And Birbal : అక్బ‌ర్‌, బీర్బ‌ల్ గురించి తెలియ‌ని వారుండ‌రంటే అతిశ‌యోక్తి లేదు. చిన్న పిల్ల‌లు మొద‌లు కొని…

Saturday, 6 July 2024, 8:09 PM

Women : మ‌హిళ‌లు ఈ పోష‌కాలు రోజూ అందేలా చూసుకోవాలి..!

Women : మహిళలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి. భర్త, పిల్లలు లేదా కార్యాలయాన్ని జాగ్రత్తగా చూసుకునేటప్పుడు,…

Saturday, 6 July 2024, 12:57 PM

Oiling To Hair : రాత్రంతా జుట్టుకు నూనె రాసి ఉంచ‌డం మంచిదేనా..?

Oiling To Hair : హెయిర్ ఆయిల్ అప్లై చేయడం శతాబ్దాలుగా జుట్టు సంరక్షణ దినచర్యలో ఒక భాగం. ఇంట్లోని…

Friday, 5 July 2024, 6:55 PM

Raisins For Skin : కిస్మిస్‌ల‌తో మీ ముఖం కాంతివంతంగా మారుతుంది ఇలా..!

Raisins For Skin : ఆరోగ్యానికి వరంలాంటి ఎండుద్రాక్ష చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా. ఎండుద్రాక్షలో అనేక…

Friday, 5 July 2024, 12:59 PM

Water Fasting : నీటి ఉప‌వాసం అంటే ఏమిటి..? దీంతో ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..?

Water Fasting : చెడు జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, చాలా మంది ప్రజలు స్థూలకాయానికి గురవుతారు.…

Thursday, 4 July 2024, 8:03 PM

Yoga : యోగా చేస్తే నిజంగానే కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారా..?

Yoga : ప్రజలు తమ పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం యువతలో జిమ్‌కి వెళ్లాలనే క్రేజ్…

Wednesday, 3 July 2024, 7:50 PM

Bottle Gourd Juice : సొర‌కాయ‌ను లైట్ తీసుకోకండి.. దీనితో క‌లిగే ఉప‌యోగాలు తెలుసా..?

Bottle Gourd Juice : బిజీ లైఫ్ స్టైల్, పేలవమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది స్థూలకాయానికి గురవుతున్నారు.…

Wednesday, 3 July 2024, 12:56 PM

Dieting : డైటింగ్ చేయ‌కుండా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..?

Dieting : మారుతున్న జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, ప్రజలు తరచుగా స్థూలకాయానికి గురవుతున్నారు. కొవ్వు పెరగడం…

Tuesday, 2 July 2024, 7:21 PM