స‌మాచారం

Banana And Eggs : మీ తోట‌లో మొక్క‌ల‌కు అర‌టిపండ్లు, కోడిగుడ్ల‌ను ఎరువుగా వేయండి.. జ‌రిగేది చూడండి..!

Banana And Eggs : అరటిపండ్లు, కోడిగుడ్లు.. ఎన్నో పోషక పదార్థాలకు నిలయంగా ఉన్నాయి. వీటిని తరచూ తింటే మనకు ఎన్నో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్ అందుతాయి. అయితే ఇవి కేవలం మనకే కాదు, మొక్కలకు కూడా ఉపయోగకరమే. ఏంటి..? ఆశ్చర్యంగా ఉందా..? అవును, మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజమే. అరటిపండ్లు, కోడిగుడ్లను మొక్కల పెంపకం కోసం ఉపయోగించ‌వ‌చ్చు. సేంద్రీయ ఎరువులా వాటిని వాడ‌వ‌చ్చు. దీంతో ఆ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

మొక్కలను పెంచాలంటే మూడు అంశాలను ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలి. అవి చక్కని మట్టిలో గుంతలు తవ్వడం, సరైన ఎరువులు వాడడం, తగిన సమయానికి నీరు పోయడం తదితర అంశాలకు ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. గుంతలు తవ్వడం, నీరు పోయడం ఎవరైనా శ్రద్ధతో చేస్తారు. కాకపోతే ఎరువుల విషయానికి వస్తేనే ఎటూ తేల్చుకోలేరు. అయితే డబ్బులు వెచ్చించి కృత్రిమ ఎరువులను వాడేందుకు ప్రస్తుతం ఎవరూ ఆసక్తిని చూపడం లేదు. ఈ క్రమంలో మొక్కల పెంపకం కోసం సేంద్రీయ ఎరువుల ఆవశ్యకత ఏర్పడింది.

Banana And Eggs

మిగతా సేంద్రీయ ఎరువుల కన్నా అరటిపండ్లు, కోడిగుడ్లు తక్కువ ధరకే వస్తాయి కాబట్టి వాటిని నిరభ్యంతరంగా ఎరువులా వాడుకోవచ్చు. సాధారణంగా మొక్కలకు సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం వంటి పోషకాలు కావల్సి ఉంటుంది. ఈ క్రమంలో అరటిపండ్లు, కోడిగుడ్లు కూడా అదే తరహా పోషకాలను మొక్కలకు అందిస్తాయి. అయితే వాటిని వాడాలంటే గుంతను కనీసం 10 నుంచి 12 ఇంచుల లోతుకు తవ్వాల్సి ఉంటుంది. బాగా పండిన అరటిపండ్లు, గడువు ముగిసిన కోడిగుడ్లను కూడా ఈ పద్ధతి కోసం ఉపయోగించవచ్చు. ఒక మొక్కకు ఒక కోడిగుడ్డు, ఒక అరటిపండు చొప్పున ఉంచాల్సి ఉంటుంది. అయితే వీటిని గుంతలో పక్క పక్కనే యథావిధిగా ఉంచాలి. వాటిని నుజ్జు నుజ్జు చేయడం, నలపడం వంటివి చేయకూడదు.

అనంతరం గుంతను సగానికి మట్టితో నింపాలి. మిగిలిన భాగంలో మొక్క వేర్లు వచ్చేలా పెట్టి మొత్తం గుంతను పూడ్చేయాలి. మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు కూడా పెరుగుతాయి. అయితే మొక్క వేర్లకు, దాని కింద ఉంచిన పదార్థాలకు దాదాపు 4,5 ఇంచుల గ్యాప్ వస్తుంది కాబట్టి మొక్క ఎదిగే క్రమంలో దాని వేర్లు ఆ గ్యాప్‌ను భర్తీ చేసి చివరిగా కింద ఉంచిన పదార్థాలను చేరుకుంటాయి. ఆ సమయంలో ఆ పదార్థాలు అధిక స్థాయిలో పోషకాలను విడుదల చేస్తూ ఉంటాయి. దీంతో వేర్ల ద్వారా ఆ పోషకాలలోని శక్తి మొక్కకు చేరి మొక్క ఏపుగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఇలా అర‌టి పండ్లు, కోడిగుడ్ల‌ను ఉప‌యోగించి మ‌న ఇంటి పెర‌ట్లో, లేదా బాల్క‌నీలో కుండీల్లో చిన్న‌పాటి మొక్క‌ల‌ను సుల‌భంగా పెంచుకోవచ్చు. దీంతో కృత్రిమ ఎరువుల‌ను వాడాల్సిన ప‌ని ఉండ‌దు. మొక్క‌లు కూడా ఏపుగా పెరుగుతాయి.

Share
IDL Desk

Recent Posts

Yoga : యోగా చేస్తే నిజంగానే కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారా..?

Yoga : ప్రజలు తమ పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం యువతలో జిమ్‌కి వెళ్లాలనే క్రేజ్…

Wednesday, 3 July 2024, 7:50 PM

Bottle Gourd Juice : సొర‌కాయ‌ను లైట్ తీసుకోకండి.. దీనితో క‌లిగే ఉప‌యోగాలు తెలుసా..?

Bottle Gourd Juice : బిజీ లైఫ్ స్టైల్, పేలవమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది స్థూలకాయానికి గురవుతున్నారు.…

Wednesday, 3 July 2024, 12:56 PM

Dieting : డైటింగ్ చేయ‌కుండా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా..?

Dieting : మారుతున్న జీవనశైలి మరియు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా, ప్రజలు తరచుగా స్థూలకాయానికి గురవుతున్నారు. కొవ్వు పెరగడం…

Tuesday, 2 July 2024, 7:21 PM

Beauty Tips : ఈ చిట్కాను పాటిస్తే చాలు మీ ముఖం అందంగా మెరిసిపోతుంది.. బ్యూటీ పార్ల‌ర్ అవ‌స‌ర‌మే ఉండ‌దు..!

Beauty Tips : అందంగా క‌నిపించేందుకు మ‌హిళ‌లు నేటి త‌రుణంలో అనేక ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తున్నారు. ఇందుకు గాను మార్కెట్‌లో ల‌భించే…

Tuesday, 2 July 2024, 10:13 AM

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను నేరుగా తిన‌లేరా.. అయితే ఇలా తినండి..!

Pumpkin Seeds : గుమ్మడికాయ గింజలు అనేక పోషకాల నిధిగా పరిగణించబడతాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు…

Monday, 1 July 2024, 8:00 PM

Monsoon Pains : వ‌ర్షాకాలంలో వ‌చ్చే కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపులు త‌గ్గేందుకు ఇంటి చిట్కాలు..!

Monsoon Pains : వర్షాకాలంలో వేడి నుండి కొంత ఉపశమనం లభిస్తుంది, కానీ వాతావరణంలో తేమ పెరగడం వల్ల అనేక…

Monday, 1 July 2024, 1:01 PM

Ghee : నెయ్యి తిన‌డం మంచిదేనా..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

Ghee : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి నెయ్యిని ఉప‌యోగిస్తున్నారు. చిన్నారుల‌కు త‌ల్లులు నెయ్యి క‌లిపి ఆహారం పెడ‌తారు.…

Sunday, 30 June 2024, 12:54 PM

Cheese And Butter : చీజ్ లేదా బ‌ట‌ర్ ఎక్కువ‌గా తింటున్నారా.. అయితే మీకు చేదు వార్త‌..!

Cheese And Butter : చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో చీజ్ లేదా బ‌ట‌ర్‌ను తింటున్నారు. వీటిని ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లు…

Sunday, 30 June 2024, 10:24 AM