ఆరోగ్యం

టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా..?

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. అధిక శాతం వ్యాప్తి చెందుతున్న అనారోగ్యాల్లో ఎక్కువగా పరిశుభ్రత లేమి వల్ల వస్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు కూడా చెబుతున్నారు. అయితే వీటిలో ప్రధానంగా చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్లే ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయట. ఈ క్రమంలో మనం నిత్యం ఎక్కువగా వాడే చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రోజూ మనం ఆయా సందర్భాల్లో చేతులను ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి, వాటికి క్రిములు ఎక్కువగా అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ క్రిములు ఎలాంటి ప్రదేశాల్లో అధికంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్క విషయం, ఇప్పుడు చెప్పబోయే ఆయా ప్రదేశాల్లో మాత్రం టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉంటాయట.

టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉండే ప్రదేశాల్లో కంప్యూటర్ కీబోర్డు కూడా ఒకటి. నేడు అధిక శాతం మంది కంప్యూటర్ల పైనే పనిచేస్తున్న నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత కచ్చితంగా ఉంది. లేదంటే అనేక రకాల వ్యాధులకు, ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైంది డబ్బు. ప్రధానంగా కరెన్సీ నోట్ల విషయానికి వస్తే ప్రతి నోటుపై కొన్ని కోట్లాది క్రిములు ఉంటాయి. ఈ క్రమంలో డబ్బులను ముట్టుకున్నా, లెక్కించినా కచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే. ఆఫీసుల్లో వాడే కప్పులకు కూడా బ్యాక్టీరియా అంటుకుని ఉంటుంది. కాబట్టి వాటిని వాడే ముందు జాగ్రత్తగా కడిగి వాడాలి. లేదంటే అనారోగ్యాలకు గురి కావల్సి వస్తుంది.

నేడు మనకు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ సోడా హబ్‌లు దర్శనమిస్తున్నాయి. అయితే వాటిని ఆపరేట్ చేసే క్రమంలో అనేక రకాల బ్యాక్టీరియాలు సోడా హబ్ బటన్లకు అంటుకుంటున్నాయి. ప్రధానంగా మలం ద్వారా వ్యాపించే క్రిములు వాటికీ వ్యాపిస్తున్నాయట. ఈ క్రమంలో సోడా హబ్‌కు వెళ్లి సోడాను తాగేముందు ఒకసారి ఆలోచించండి. లేదంటే ఇవి సమస్యలను తెచ్చి పెడతాయి. స్విమ్మింగ్ పూల్స్‌లోనూ కోట్లాది క్రిములు ఉంటాయి. బాగా శుభ్రం చేసిన నీరు ఉంటేనే అందులోకి వెళ్లమని వైద్యులు సూచిస్తున్నారు. మనం ఏదైనా తినే క్రమంలో ఒక్కోసారి ఆహారం కింద పడుతుంటుంది. ఈ క్రమంలో అధిక శాతం మంది కింద పడ్డ ఆహారాన్ని కూడా తింటుంటారు. అయితే ఇలా తినడం చాలా అనారోగ్యకరమట. ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయట.

క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్ చేసేందుకు ఉపయోగించే కార్డ్ రీడర్‌లకు కూడా ఎక్కువగా బ్యాక్టీరియా అంటుకుని ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటిని వాడితే కచ్చితంగా చేతులను కడుక్కోవాలి. నేటి తరుణంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. అయితే వీటికి కూడా సూక్ష్మ క్రిములు వ్యాపిస్తున్నాయి. ప్రధానంగా డివైస్ స్క్రీన్‌పై ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి మొబైల్స్‌ను వాడినప్పుడు కూడా శుభ్రత పాటించాల్సిందే. నిత్యం కొన్ని వందల మంది అభిమానులు తమ సినీ తారల సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తారు. అయితే వీటిలోనూ సూక్ష్మ క్రిములు అధికంగానే ఉంటాయట. అధిక శాతం మంది ప్రజలు వాడే యంత్రాల్లో ఏటీఎం మిషన్లు కూడా ఉన్నాయి. వీటి వద్ద కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఎంత పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువునైనా సులభంగా నియంత్రించే రిమోట్ కంట్రోల్‌పై కూడా క్రిములు పేరుకుని ఉంటాయి. కాబట్టి దీని విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే. పెంపుడు కుక్కలు, పిల్లలు అభిమానంతో నాకితే వెంటనే స్నానం చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే వాటి నాలుక ద్వారా కొన్ని లక్షల సూక్ష్మ జీవులు మనపైకి వ్యాపిస్తాయట. బ్రాలు ధరించే మహిళలు కూడా శుభ్రతను పాటించాల్సిందేనట. ఎందుకంటే వాటిని వేసుకుంటే చెమట అధికంగా పడుతుందట. ఈ క్రమంలో సూక్ష్మ జీవులు శరీరంపై పేరుకుపోతాయి. కాబట్టి వాటిని తీసేసిన వెంటనే శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతోపాటు వాటిని కూడా తప్పనిసరిగా వాష్ చేయాలి.

టాయిలెట్ల లోపల లేదా వాటి పక్కనే టూత్‌బ్రష్‌లను స్టాండ్‌లలో ఉంచుతున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే టాయిలెట్లలో ఉండే క్రిములు టూత్‌బ్రష్‌లపైకి కూడా వ్యాపిస్తాయట. దీంతో ప్రమాదకరమైన అనారోగ్యాలు కలుగుతాయట. కాబట్టి మీ టూత్‌బ్రష్‌లను టాయిలెట్లకు దూరంగా ఉంచండి. ఎస్కలేటర్లపై రెండు వైపులా చేతులతో పట్టుకునేందుకు ఉపయోగపడే రెయిలింగ్‌లపై కూడా బ్యాక్టీరియాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఈ క్రమంలో వాటిని పట్టుకున్నాక ఏమీ తినకండి! చేతులు శుభ్రంగా కడిగాకే ఏదైనా తినండి. పెట్రోల్ పంపుల్లో ఇంధనం నింపేందుకు వాడే హ్యాండిల్‌పై క్రిములు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటిపై కూడా ఓ లుక్కేయండి.

చిన్నారులు ఎక్కువగా ఆడుకునే ప్లే గ్రౌండ్స్‌తోపాటు ఆట మైదానాల్లోనూ సూక్ష్మ క్రిములు ఎక్కువగానే ఉంటాయి. ప్రధానంగా పిల్లలు ఈ తరహా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారి సంరక్షణపై కూడా దృష్టి పెట్టండి.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM