Papaya Seeds : ఆరోగ్యానికి బొప్పాయి పండ్లు మేలు చేస్తాయని, చాలామంది బొప్పాయి పండ్లను తింటూ ఉంటారు. బొప్పాయి వలన కలిగే ప్రయోజనాలు కూడా అందరికీ తెలుసు. అయితే, బొప్పాయి పండ్ల వలన కలిగే లాభాలు తెలిసినా, బొప్పాయి పండ్ల గింజల వలన కలిగే లాభాలు చాలామందికి తెలియదు. పండు తినేటప్పుడు, పండు కోసుకుని గింజల్ని పారేస్తూ ఉంటాం. అందరూ ఇదే చేస్తూ ఉంటారు. కానీ, నిజానికి బొప్పాయి గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. ఈ ఆరోగ్య ప్రయోజనాలను కనుక మీరు చూసినట్లయితే, కచ్చితంగా ఈసారి బొప్పాయి గింజల్ని దాచిపెట్టుకుని తింటారు.
బొప్పాయి గింజల వలన ఎన్నో లాభాలు కలుగుతాయి. చాలా సమస్యలకి దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యానికి బొప్పాయి గింజలు బాగా ఉపయోగపడతాయి. రోజుకి 10 నుండి 15 గింజల్ని సలాడ్లలో లేదంటే కూర మీద చల్లుకొని తీసుకోండి. లేదంటే, మీరు పొడి చేసుకుని తీసుకోవచ్చు. ఈ పొడిని తీసుకుంటే, లివర్ ఆరోగ్యం బాగుంటుంది. అలానే, కిడ్నీ వ్యాధులని బొప్పాయి గింజలు నయం చేస్తాయి. బొప్పాయి గింజలతో జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు బొప్పాయి గింజల్ని తీసుకుంటే, ఆ సమస్య నుండి బయటపడొచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచుకోవచ్చు.
అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వాళ్ళు బొప్పాయి గింజల్ని తీసుకుంటే, చక్కగా ఆ సమస్యల నుండి బయటకి వచ్చేయొచ్చు. రక్తపోటుని నియంత్రణలో ఉంచేటట్టు బొప్పాయి గింజలు చేస్తాయి. కండరాలని దృఢంగా మార్చగలవు. పని ఒత్తిడి వలన చాలామంది అలసటతో ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు, బొప్పాయి గింజల్ని తీసుకుంటే, అలసట తగ్గుతుంది. బొప్పాయి గింజలు ఒకేసారి మీరు తీసుకుని ఎండబెట్టుకుని పొడి చేసుకోవచ్చు.
ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటుంది. పాడవదు. ఈ పొడిని మీరు కాఫీ, టీ లలో కూడా వేసుకుని తీసుకోవచ్చు. ఈ పొడి కాస్త చేదుగా ఉంటుంది. కనుక, మీరు ఎప్పుడైనా తీసుకునేటప్పుడు కొంచెం తేనెను కానీ బెల్లాన్ని కానీ కలిపి తీసుకోవచ్చు. రోజుకి పావు స్పూన్ వరకు తీసుకోవచ్చు. అంతకుమించి తీసుకోవద్దు. ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ అనుమానాలు కానీ ఉన్నట్లయితే, డాక్టర్ని సంప్రదించి తీసుకోవడం మంచిది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…