Over Weight : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది అధిక బరువు, పొట్ట దగ్గర కొవ్వుతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి ఒక మంచి డ్రింక్ తయారు చేసుకుందాం. ఈ డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి పావు స్పూన్ మిరియాలను కచ్చాపచ్చాగా దంచి వేయాలి. ఒక నిమిషం మరిగాక చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న అల్లం ముక్క వేయాలి. ఆ తర్వాత పావు టీస్పూన్ పసుపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగాక దించి వడకట్టాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక కప్పు తాగాలి.
ఉదయం సమయంలో పరగడుపున తాగాలి. ఈ డ్రింక్ తాగాక 40 నిమిషాల వరకు ఏమీ తినకూడదు, తాగకూడదు. బరువు బాగా ఎక్కువ ఉన్నవారు రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఈ డ్రింక్ తాగాలి. ఈ డ్రింక్ ని ఐదు రోజులు తీసుకోవాలి. ఆ తర్వాత మూడు రోజులు గ్యాప్ ఇచ్చి మరో ఐదు రోజులు తాగాలి. ఈ విధంగా డ్రింక్ తాగడం వలన అధిక బరువు తగ్గడమే కాకుండా పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది. మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. కేలరీలు కూడా వేగంగా ఖర్చవుతాయి. దాంతో కొవ్వు కరుగుతుంది.
అధిక బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వేడి శరీరం ఉన్నవారు రోజుకి ఒకసారి మాత్రమే తాగాలి. ఎందుకంటే పైన చెప్పిన పదార్థాలన్నీ వేడి చేసే పదార్ధాలు. వేడి శరీరం ఉన్నవారు ఈ డ్రింక్ తాగినప్పుడు ఏమైనా అసౌకర్యం ఉంటే డ్రింక్ తాగడం మానేయాలి.. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…