Garuda Puranam : భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కాకపోతే ఒక జీవి ముందు, ఒక జీవి తరువాత చనిపోతుంది. అందుకు మనిషి కూడా అతీతుడు కాదు. మనిషైనా ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోవాల్సిందే. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ.. మనిషి జీవిత కాలాన్ని మాత్రం నిజంగా ఆపవచ్చు. అంటే.. చావు నుంచి తప్పించుకోవడం అని కాదు. కానీ చావును కొంత ఆలస్యంగా వచ్చేలా చేయడం అన్నమాట. అంటే.. కొంత ఎక్కువ కాలం జీవించడం అని మనం తెలుసుకోవాలి. మరి అలా ఎక్కువ కాలం జీవించాలంటే ఏం చేయాలి..? అంటే.. ఇందుకు మీ వద్ద సమాధానం ఉండకపోవచ్చు. కానీ గరుడ పురాణం మాత్రం అందుకు సమాధానాలు చెబుతోంది. మరి ఆ సమాధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
గరుడ పురాణంలో ఏముంటుందో మనందరికీ తెలిసిందే కదా. మనిషి తన జీవిత కాలంలో చేసే ఆయా పనులకు నరకంలో ఎలాంటి శిక్షలు పడతాయో అందులో క్లియర్‌గా రాసి ఉంటుంది. అయితే కేవలం ఇదే విషయం మాత్రమే కాకుండా మనిషి జీవిత కాలం పెరగాలంటే ఏం చేయాలో కూడా అందులో రాసి ఉంది. మరి మన జీవిత కాలాన్ని పెంచుకునేందుకు గరుడ పురాణం ప్రకారం ఎలాంటి సూచనలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట భోజనంలో ఎవరూ కూడా పెరుగు తినరాదు. ఎందుకంటే ఇది ఆ సమయంలో సరిగ్గా జీర్ణం కాదట. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చి జీవిత కాలం, ఆయుర్దాయం తగ్గిపోతుందట. కనుక రాత్రి పూట పెరుగు తినరాదు. రాత్రి పూట చాలా మంది డిన్నర్ చేయగానే వెంటనే నిద్రపోతారు. కానీ అలా చేయరాదట. తిన్న వెంటనే నిద్రిస్తే అనారోగ్యాలు కలిగి జీవిత కాలం తగ్గుతుందట. కాబట్టి తిన్న వెంటనే నిద్రపోరాదు. రాత్రి పూట మాంసాహారం తినరాదు. తింటే అది సరిగ్గా జీర్ణం కాక అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. దీంతో అనారోగ్యం కారణంగా మనిషి ఆయుర్దాయం తగ్గుతుంది. త్వరగా చనిపోతాడు. కనుక రాత్రి పూట మాంసాహారం మానేస్తే జీవిత కాలాన్ని, ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు.
కొందరు ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తారు. అలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి అవి జీవిత కాలాన్ని తగ్గిస్తాయట. కనుక ఎవరైనా ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. ఆలస్యం చేయకూడదు. ఇక ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల ఆ సమయంలో వచ్చే గాలిని పీల్చుకుంటే అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయట. శ్మశానాల్లో దహన కార్యక్రమాలను నిర్వహించగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉండే బాక్టీరియాలు మన శరీరాల్లోకి వెళితే అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. వాటి వల్ల మనం త్వరగా చనిపోవాల్సి వస్తుంది. దీంతో జీవిత కాలం తగ్గుతుంది. కనుక ఎవరైనా ఎక్కువ కాలం జీవించాలంటే.. శ్మశానాల్లో దహన కార్యక్రమాలు ముగియగానే వెంటనే ఇంటికి చేరుకోవాలి. అక్కడే వెయిట్ చేయరాదు.
ఇక చివరిగా గరుడ పురాణం ప్రకారం.. భార్యాభర్త ఎవరైనా రాత్రి పూటే శృంగారంలో పాల్గొనాలట. ఉదయం చేయకూడదట. చేస్తే ఆయుష్షు తగ్గుతుందని, ఆ సమయంలో మనిషి శరీర రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొంటే వచ్చే అనారోగ్య సమస్యలు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయని గరుడ పురాణం చెబుతోంది. కనుక దంపతులు రాత్రి పూటే శృంగారంలో పాల్గొంటే మంచిది. ఆయుష్షు పెరుగుతుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…