ఆరోగ్యం

Onions : ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేశాక ఎక్కువ సేపు ఉంచ‌కూడ‌ద‌ట‌.. త్వ‌ర‌గా వాడాల‌ట‌.. ఇది నిజ‌మేనా..?

Onions : ఉల్లిపాయ‌ల‌తో మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. ఎన్నో పోష‌కాల‌కు నెల‌వైన ఉల్లిపాయ‌ల‌ను మ‌నం నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వల్ల వాటితో ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన లాభాలు ఉన్నాయి. అయితే వాటి గురించిన ఒక పుకారు ఇప్పుడు నెట్‌లో, ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఆస‌క్తి రేపుతున్న ఆ ఉల్లిపాయ పుకారు ఏంటో మీరే చూడండి..!

ఉల్లిపాయ‌లు స‌హ‌జంగానే ఘాటైన స్వ‌భావాన్ని క‌లిగి ఉంటాయి. అందుకే వాటిని కోసిన‌ప్పుడు మ‌న క‌ళ్ల వెంట నీళ్లు వ‌స్తాయి. అయితే ఉల్లిపాయ‌ల‌ను స‌గానికి కోసి అలాగే ఉంచిన‌ప్పుడు అవి బాక్టీరియా, సూక్ష్మ క్రిముల‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తాయ‌ట‌. ఈ క్ర‌మంలో ఎక్కువ సేపు అలాగే ఉంచిన ఉల్లిపాయ‌ల్లో బాక్టీరియా, క్రిములు ఎక్కువ‌గా పేరుకుపోతాయ‌ట‌. దీంతో అలా ఎక్కువ సేపు ఉంచిన ఉల్లిపాయ‌ల‌ను వాడితే వాటిలో ఉండే బాక్టీరియా అంతా మ‌న శ‌రీరంలోకి వెళ్లి ఇన్‌ఫెక్ష‌న్ల‌ను, క‌డుపు నొప్పిని క‌లిగిస్తుంద‌ట‌. ఒక రోజు క‌న్నా ఎక్కువ సేపు అలాగే ఉంచిన ఉల్లిపాయ‌ల‌తో ఇలా జ‌రుగుతుంద‌ట‌. అందుకే ఉల్లిపాయ‌ల‌ను క‌ట్ చేసిన త‌రువాత వెంట‌నే ఉప‌యోగించాల‌ట‌. అంతే కానీ వాటిని ఎక్కువ సేపు ఉంచి మాత్రం వాడ‌కూడ‌ద‌ట‌. ఇదీ ఇప్పుడు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఉల్లిపాయ పుకారు.

Onions

అయితే పైన చెప్పిన ఆ ఉల్లిపాయ పుకారులో ఎంత మాత్రం వాస్త‌వం లేదట‌. దీన్ని న‌మ్మాల్సిన ప‌ని లేద‌ని కొంద‌రు సైంటిస్టులు చెబుతున్నారు. ఎందుకంటే ఉల్లిపాయకు ఉండే ఘాటైన వాస‌న కార‌ణంగా అందులో ఎలాంటి బాక్టీరియా చేర‌ద‌ట‌. అలాంటి స్థితిలో ఉల్లిపాయ‌లో ఏ బాక్టీరియా కూడా వృద్ధి చెంద‌ద‌ట‌. కాక‌పోతే దాన్ని కోసే స‌మ‌యంలో, నిల్వ చేసే స‌మ‌యంలో శుభ్రంగా ఉండాల‌ట‌. లేదంటే బాక్టీరియా చేరుతుంద‌ని వారు చెబుతున్నారు. శుభ్రంగా కోసి ప్ర‌త్యేక‌మైన పాత్ర‌ల్లో శుభ్ర‌మైన ప‌ద్ధ‌తిలో నిల్వ చేస్తే 2-3 రోజుల వ‌ర‌కు ఉల్లిపాయ‌లు స్వ‌చ్ఛంగానే ఉంటాయ‌ని, వాటిని ఎలాంటి భ‌యం లేకుండా వాడుకోవ‌చ్చ‌ని వారు సెల‌విస్తున్నారు. అయితే ఉల్లిపాయ‌లే కాదు, ఎలాంటి ఆహార‌న్న‌యినా శుభ్ర‌మైన వాతావ‌ర‌ణంలోనే ఉంచాల‌ని, చేతులు శుభ్రంగా ఉన్న‌ప్పుడే దాన్ని ముట్టుకోవాల‌ని చెబుతున్నారు. అంతే క‌దా మ‌రి..!

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM