ఆరోగ్యం

Pregnant Woman : గ‌ర్భం దాల్చిన స్త్రీలు, బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన వారు తెలుసుకోవాల్సిన విష‌యాలివే..!

Pregnant Woman : మాతృత్వం అనేది స్త్రీలంద‌రికీ ఓ వ‌రం లాంటిది. దాదాపుగా ప్ర‌తి ఒక్క స్త్రీ వివాహం అయిన త‌రువాత త‌ల్లి కావాల‌ని, మాతృత్వ‌పు ఆనందాన్ని అనుభ‌వించాల‌ని క‌ల‌లు కంటుంది. అందుకు అనుగుణంగా త‌న క‌ల‌ను నిజం చేసుకుంటుంది కూడా. అయితే కొందరికి మాత్రం మాతృత్వం చెదిరిన క‌ల‌గా మారిపోతుంది. అది వేరే విష‌యం. కానీ చాలా మంది త‌ల్లులు తొలిసారి మాతృత్వం పొంద‌గానే అప్పుడు అనుభ‌వించే ఆ అనుభూతి వేరేగా ఉంటుంది. ఈ క్ర‌మంలో బిడ్డ జ‌న్మించ‌డానికి ముందు, జ‌న్మించిన త‌రువాత డాక్ట‌ర్‌తోపాటు కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు త‌ల్లుల‌కు ఎన్నో విష‌యాల‌ను, జాగ్ర‌త్త‌ల‌ను చెబుతుంటారు. అది అలా చేయకూడ‌ద‌ని, ఇది తిన‌కూడ‌దు, అది తినాలి.. అని చెబుతారు. అయితే అవే కాదు, బిడ్డ‌కు జ‌న్మనివ్వ‌బోతున్న‌, జ‌న్మ‌నిచ్చిన ఏ త‌ల్లి అయినా కొన్ని విష‌యాల‌ను గురించి క‌చ్చితంగా తెలుసుకోవాల్సిందే. అవేమిటంటే..

బిడ్డ జ‌న్మించ‌డంతోనే డెలివ‌రీ పూర్తి కాదు. బిడ్డ‌కు చుట్టుకుని ఉండే మాయ‌, ఇత‌ర ద్ర‌వాల‌న్నీ బ‌య‌టికి వ‌స్తేనే డెలివ‌రీ పూర్త‌యిన‌ట్టు. కాక‌పోతే బిడ్డ వేగంగా బ‌య‌టికి వ‌స్తుంది, కానీ ఇత‌ర వాటికి కొద్దిగా స‌మ‌యం ప‌డుతుంది. అయితే వాటి గురించి నొప్పులు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. బిడ్డ జ‌న్మించే స‌మ‌యంలోనే నొప్పులు ప‌డాల్సి వ‌స్తుంది. చాలా మంది గ‌ర్భిణీలకు డాక్ట‌ర్లు డెలివ‌రీ తేదీల‌ను ఇస్తారు. కానీ అలా ఇచ్చిన తేదీల్లో కేవ‌లం 5 శాతం మంది మాత్ర‌మే కచ్చిత‌మైన టైంకు డెలివ‌రీ పొందుతార‌ట‌. కాబ‌ట్టి స‌రైన టైంకు డెలివ‌రీ కాక‌పోతే ఆందోళ‌న ప‌డాల్సిన ప‌నిలేదు. అది స‌హ‌జ‌మే.

Pregnant Woman

డెలివ‌రీ స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వెన్నెముక భాగంలో ఎపిడ్యుర‌ల్ అనే నీడిల్‌ను నొప్పి త‌గ్గ‌డం కోసం ఇస్తారు. అయితే దీన్ని నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం కోస‌మే కానీ, దాంతో న‌డుం కింది భాగం ఎలాంటి అనారోగ్యానికి గురి చెందదు. కాక‌పోతే కాళ్లు, పాదాల వంటి భాగాల్లో స్ప‌ర్శ లేన‌ట్టుగా కొంత స‌మ‌యం పాటు అనిపిస్తుంది. కానీ అది కొంత సేపే. త‌రువాత అంతా సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తుంది. డెలివ‌రీ త‌రువాత వైద్యులు త‌ల్లుల‌కు వెన్నెముక‌, పొట్ట భాగాల్లో మ‌ర్ద‌నా చేస్తారు. దీని వ‌ల్ల గ‌ర్భాశ‌యం తిరిగి సాధార‌ణ సైజ్‌కు చేరుకుంటుంది. అంతేకాదు, బ్లీడింగ్ కూడా త‌గ్గుతుంది. బిడ్డ డెలివ‌రీ త‌రువాత 6 నెల‌ల వ‌ర‌కు కొంద‌రు మ‌హిళ‌ల్లో ర‌క్త‌స్రావం జ‌రుగుతూనే ఉంటుంది. దీన్ని చూసి కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు. నాప్‌కిన్స్‌, అడ‌ల్ట్ డైప‌ర్స్ వాడితే స‌రిపోతుంది.

త‌ల్లి నుంచి బిడ్డ వేరైనాక కొన్ని రోజులు, వారాలు, నెల‌ల వ‌ర‌కు బిడ్డ బొడ్డు తాడు అలాగే ఉంటుంది. దాన్ని దానంతట అదే రాలిపోయే వ‌ర‌కు ఉంచాలి. కానీ తీసేందుకు ప్ర‌యత్నించ‌కూడ‌దు. డాక్ట‌ర్లు కూడా దాన్ని తీసేందుకు నిరాక‌రిస్తారు. గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌ల‌కు క‌డుపులో ఉన్న బిడ్డ ఒత్తిడి క‌లిగిస్తూ ఉండ‌డం వ‌ల్ల మాటి మాటికీ విరేచ‌నం క‌లుగుతూ ఉంటుంది. ఇది కూడా స‌హ‌జ‌మే. ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు. నెల‌లు నిండ‌కుండానే జ‌న్మించిన శిశువు ఒక ర‌క‌మైన పొర‌తో జ‌న్మిస్తుంది. దీన్ని వెర్నిక్స్ కెసోసా అంటారు. ఇది కొన్ని సంద‌ర్భాల్లో బిడ్డ చుట్టూ కూడా ఉంటుంది. దీని గురించి దిగులు చెందాల్సిన ప‌ని లేదు. బిడ్డ‌ను సంర‌క్షించ‌డం కోసమే ఈ పొర ఉంటుంది.

కొంత మంది శిశువులు చేతులు, భుజాలు, వెన్నెముక వంటి భాగాల్లో వెంట్రుక‌ల‌తో జ‌న్మిస్తారు. ఇది కూడా స‌హ‌జ‌మే. టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌ని లేదు. బిడ్డ జ‌న్మించే స‌మ‌యంలో త‌ల్లి యోని నుంచి బ‌య‌ట‌కు రావాల్సి ఉంటుంది కాబ‌ట్టి, ఆ స‌మ‌యంలో యోని ఆకారానికి అనుగుణంగా బిడ్డ ఆకృతి మారుతుంది. కానీ కొన్ని రోజుల త‌రువాత పూర్వ స్థితిని సంత‌రించుకుంటుంది.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM