Olive Oil : ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ని ఎక్కువ మంది వంటల్లో వాడుతూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ని వంటల్లో వాడడం వలన, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆలివ్ పండ్ల నుండి, ఆలివ్ ఆయిల్ ని తయారుచేస్తారు. ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. సౌందర్య ప్రయోజనాలు కూడా ఆలివ్ ఆయిల్ తో మనం పొందవచ్చు. ఈ ఆయిల్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
మంచి కొలెస్ట్రాల్ ని ఇది పెంచుతుంది. ధమనుల పనితీరుకి అడ్డుగా ఉన్న కొవ్వుని కరిగించగలదు. రక్తప్రసరణ మెరుగుపరిచేటట్టు చూస్తుంది. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. యాంటీ డిప్రెసెంట్ గా కూడా ఇది పనిచేస్తుంది. అలానే, ఒత్తిడిని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మానసిక స్థాయిని పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మెదడు యొక్క పనితీరుని ఇది ప్రోత్సహిస్తుంది.
జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు కూడా ఈ నూనెతో తగ్గిపోతాయి. నొప్పి ఉన్న ప్రాంతంలో ఆలివ్ ఆయిల్ రాసి, పది నిమిషాలు పాటు మసాజ్ చేస్తే, నొప్పుల నుండి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువ ఉంటాయి.
చర్మం కూడా బాగుంటుంది. ఈ నూనె జుట్టు కి కావాల్సిన పోషణ ని కూడా ఇస్తుంది. జుట్టుని తేమగా ఉంచుతుంది. చుండ్రుని కూడా పోగొడుతుంది. అవసరమైన పోషకాలు జుట్టు కి అంది, జుట్టు బలంగా, పొడుగ్గా మారుతుంది. ఇలా, ఆలివ్ ఆయిల్ తో ఇన్ని లాభాలని పొందవచ్చు. కనుక, రెగ్యులర్ గా ఆలివ్ ఆయిల్ ని వాడడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…