వినోదం

Guppedantha Manasu December 13th Episode : శైలేంద్ర‌ను బ్రతిమాలాడుతున్న వసుధార.. రిషి మిస్సింగ్ పై దేవయానికి డౌట్..!

Guppedantha Manasu December 13th Episode : శైలేంద్ర గురించి, ధరణి మొత్తం మహేంద్ర వసుధారాలకి చెప్పేస్తుంది. ముకుల్ ఇన్వెస్టిగేషన్ నుండి తప్పించుకోవడానికి, తనపై తానే రౌడీలతో ఫేక్ అటాక్ చేయించుకున్నాడని అంటుంది. తన నిజ స్వరూపం బయటపడకుండా ఉండడానికి తనతో మారిపోయినట్లు నాటకం ఆడుతున్నట్లు కూడా చెప్పేస్తుంది ధరణి. ఇది విని అనుపమ షాక్ అవుతుంది. మీ ఫ్రెండ్ జగతిని చంపింది ఎవరు అని చాలా సార్లు అడిగావు కదా..? ఆమె ప్రాణాలు ఎవరు తీసారో ఇప్పుడు అర్థమైందా అని అనుపమతో మహేంద్ర చెప్తాడు.

కాలేజీ ఎండి సీటు దక్కించుకోవడానికి, రిషి జగతిలపై సైలేంద్ర చేసిన కుట్రలని మొత్తం బయట పెట్టేస్తుంది ధరణి. వసుధారకి అనుపమా క్షమాపణలు చెబుతుంది. మహేంద్ర నీ గురించి చెప్పినా కూడా నేను నమ్మలేదని ఎమోషనల్ అవుతుంది. భార్య ఇలా చెప్తుంటే, అతను ఎంత దుర్మార్గుడు అనేది తెలుస్తోందని, మహేంద్ర వసుధారలతో అంటుంది అనుపమ. మనుషుల్ని శైలేంద్ర మాయ చేస్తాడని ధరణి చెప్తుంది. అంతా జరిగిపోయాక ఏడుస్తూ కూర్చోవడం కాకుండా, శైలేంద్ర కుట్రలు మొత్తం బయటకి రావాలని ధరణి అంటుంది. అతను చేసిన ఘోరాల గురించి ఫణింద్ర కి కూడా చెప్పలేని పరిస్థితుల్ని తీసుకొచ్చాడు శైలేంద్ర అని అంటుంది.

సాక్ష్యాలతో రిషికి శైలేంద్ర గురించి చెప్పాలని అనుకుంటే, అతను కనపడలేదని మహేంద్ర అంటాడు. ముందు రిషి ఎక్కడున్నాడో వెతకాలని వసుధారతో అంటాడు మహేంద్ర. సైలేంద్ర నేరస్తుడని, ఎలా నిరూపించాలని బాధపడతాడు. రిషి కనబడకుండా వెళ్లిపోయాడు అని బాధపడతాడు. మీరు మా దగ్గరికి వచ్చినట్లుగా, ఈ కుట్రల గురించి మాకు చెప్పినట్లుగా శైలేంద్రకు తెలియకుండా జాగ్రత్త పడమని హెచ్చరిస్తుంది. వసుధారా ధరణి తో నీ వెంట మీ ఇంటికి వస్తానని చెప్తుంది కానీ అనుపమ వారిస్తుంది.

వినకుండా ధరణి వెంట వసు వెళుతుంది. ధరణి ఇంట్లో కనపడకపోవడంతో సైలేంద్ర కంగారు పడతాడు. రిషి ని నువ్వే కిడ్నాప్ చేసావా…? అతను కనబడకపోవడానికి కారణం నువ్వేనా అని కొడుకుని నిలదీస్తుంది. కారణం చెప్పకుండా శైలేంద్ర తెలివిగా మాట దాటేస్తాడు. నీ మాటలను బట్టి చూస్తుంటే రిషి కనపడడానికి కారణం నువ్వేనని తెలుస్తోంది అని, కొడుకుతో అంటుంది. రిషి ఎక్కడున్నాడో తెలియాలంటే, అందరితో పాటుగా ఎదురు చూడమని అంటాడు.

Guppedantha Manasu December 13th Episode

రిషి ప్రాణాలతో ఉన్నాడా లేదా అని కొడుకుని గట్టిగా అడుగుతుంది. రిషి గురించి నాకు తెలియదు. దీని గురించి నన్ను అడగద్దు అని సీరియస్ అవుతాడు శైలేంద్ర. ధరణి కనపడకుండా పోవడంతో, శైలేంద్ర భయపడతాడు. ఎక్కడ ఉందో తెలుసుకోమని తల్లితో అంటాడు. అప్పుడే ధరణి వస్తుంది. ఆమె వెంట వసుధారా వచ్చేసరికి శైలేంద్ర దేవయాని షాక్ అవుతారు. శైలేంద్ర తో మాట్లాడాలని దేవయానిని బయటకి పంపిస్తుంది వసుధార.

మహేంద్ర వల్లే జగతి చనిపోయిందని అతన్ని అవమానించిన విషయాలను గుర్తు తెచ్చుకొని అనుపమ ఎమోషనల్ అయిపోతుంది. జరిగింది తెలుసుకోకుండా తొందర పడ్డాను అని అనుకుంటుంది. రిషి ఎక్కడని శైలేంద్ర ని అడుగుతుంది. నాకు అదే కావాలి నేను గాయపడ్డానని తెలిసినా రిషి హాస్పిటల్ కి రాలేదని, రివర్స్ గేమ్ ఆడుతాడు. ఎవరికి రిషి కనబడలేదు అని తెలిసిన తర్వాత ఆనంద పడుతున్నానని అంటాడు.

రిషి ఎక్కడున్నాడో నీకు తప్పకుండా తెలుసని నిలదీస్తుంది అయితే ప్రూవ్ చేయమని వసుధారాతో చాలెంజ్ చేస్తాడు. నువ్వు కోపంగా చూస్తే భయపడిపోనని ఇక్కడ ఉన్నది శైలేంద్ర అని వసుధారని భయ పెడతాడు. రిషి నీ మనసులో ఉన్నాడు కదా నీ మనసుని అడిగితే, తను ఎక్కడున్నాడో తెలుస్తుంది అని సెటైర్ వేస్తాడు. మాటలు హద్దు దాటుతున్నాయని, మర్యాదగా మాట్లాడమని చెప్తుంది.

రిషి ఎక్కడున్నాడో చెప్పేదాకా ఇక్కడ నుండి వెళ్ళనని అంటుంది. నన్ను చంపేస్తావా నేను చనిపోతే రిషి సేఫ్ గా ఉంటాడని, గ్యారెంటీ ఏంటని శైలేంద్ర అంటాడు. రిషి ఎక్కడున్నాడు నీకు తెలుసు కదా అని అడుగుతుంది. నువ్వు అడిగే తీరు నాకు నచ్చలేదు అందుకే రిషి ఎక్కడున్నాడో నేను నీకు చెప్పనని శైలేంద్ర అంటాడు. నా ముందు మాట్లాడే వాళ్ళు తలదించుకోవాలి. నా నుండి ఏదైనా అవసరం అంటే అడుక్కోవాలి. రెండు చేతులు జోడించి బిక్షం ఆడుకుంటున్నట్లు అడుక్కోవాలి అని చెప్తాడు. భర్త ఆచూకీ కోసం వసుధారా తగ్గుతుంది ప్లీజ్ రిషి ఎక్కడున్నాడో చెప్పమని కన్నీళ్ళతో శైలేంద్ర ని బతిమిలాడుతుంది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM