Vastu Tips For Income : చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం మనం నడుచుకోవడం వలన, ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండొచ్చు. అయితే, కొంతమంది ఎంత సంపాదించినా కూడా ఒక రూపాయి చేతిలో నిలవదు. ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. ఆర్థిక సమస్యల్లో కూరుకు పోతుంటారు. అయితే, జీతం పెరిగి, ఆదాయం రెట్టింపు అవ్వాలని అనుకునేవారు ఈ వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం రెట్టింపు అవుతుంది. మరి ఇందుకోసం ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
ఉద్యోగులు వారికి నచ్చిన రంగంలో ఎదగడానికి, ప్రమోషన్లు పొందడానికి, ఈ వాస్తు చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. కెరీర్ బాగుండాలంటే పక్షులకి ఆహారం, నీళ్లు అందించాలి. ఆకాశంలో ఎగిరే పక్షుల్లో దేవతలు ఉంటారు. అందుకే పక్షులకి ఆహారం నీళ్లు ఇస్తే మంచిది. దేవతలు ఆశీస్సులు లభిస్తాయి.
అలానే, వీధి కుక్కలకి ఆహారం పెడితే ఎంతో పుణ్యం వస్తుంది. రోడ్డు మీద తిరిగే ఆవులకి కూడా ఆహారాన్ని పెట్టండి. ఉద్యోగంలో వృద్ధి లభిస్తుంది. ఇంట్లో పెద్దల్ని దేవతలతో పోలుస్తారు. ఏదైనా పండుగ సమయంలో కాని శుభకార్యాలప్పుడు కానీ, ఇంట్లో తల్లిదండ్రులకి పెద్దలకి నమస్కరించాలి అని హిందూ సంప్రదాయం చెబుతోంది. అలానే, పని చేసే ప్రాంతంలో పచ్చని చెట్లు ఉండేలా చూడండి.
డెస్క్ మీద మనం చిన్న పాటి మొక్క ఉన్న కుండీని కూడా పెట్టుకోవచ్చు. మొక్కలు పాజిటివ్ ఎనర్జీని తీసుకు వస్తాయి. వీటిని పెడితే, మూడ్ కూడా బాగుంటుంది. ఈ మొక్కలకు ముళ్లు మాత్రం లేకుండా చూడండి. పని చేసే టేబుల్ కింద డస్ట్ బిన్ వంటివి పెట్టద్దు. టేబుల్ పక్కన, డెస్క్ పక్కన డస్ట్ బిన్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఒకవేళ టేబుల్ కింద డస్ట్ బిన్ ని కచ్చితంగా ఉంచాలంటే, ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ ఉండదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…