Sandeep Reddy Vanga Animal Earnings : ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా యానిమల్ మూవీ ఫీవర్ నడుస్తుంది. కొందరు యానిమల్ క్యారెక్టర్స్‌లోకి ఒదిగిపోతున్నారు. మూవీలోని క్యారెక్టర్స్‌లో కొందరి ముఖాలతో ఎడిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా సచిన్ టెండూల్కర్ మొదలుకొని ఇషాన్ కిషన్ వరకు పలువురిని చాలా చక్కగా హీరో రణబీర్ కపూర్ క్యారెక్టర్‌కు జోడించారు. వీడియో మొదలు కావడమే కెప్టెన్ రోహిత్ శర్మ కనిపిస్తాడు. చివరికి విలన్ బాబీ డియోల్ క్యారెక్టర్‌లో సచిన్ దర్శనిమిస్తాడు. మధ్యలో ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ కనిపిస్తారు. ముంబై ప్లేయర్ల ముఖాలతో చేసిన వీడియో అందరిని తెగ ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన యానిమల్ మానియా నడుస్తుంది. ఇంకా కలెక్షన్స్ స్టడీగానే వస్తున్నాయి. 10వ రోజు కలెక్షన్లను కలిపితే ఈ సినిమా 700 కోట్ల రూపాయలు క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా ఇంత హిట్ కావడం వెనక సందీప్ రెడ్డి కృషి ఎక్కువ ఉందని అంటున్నారు. ఒకప్పుడు అర్జున్ రెడ్డి సినిమా తీయడానికి కేవలం రూ.1.5 కోట్ల అవసరం కాగా, దాని కోసం 36 ఎకరాల మామిడి తోట అమ్మిన అతను ఇప్పుడు యానిమల్ ద్వారా రూ.200 కోట్లు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది. సందీప్ తన సొంత ప్రొడక్షన్ భద్రకాళీ పిక్చర్స్.. టీ-సిరీస్ తో కలిసి సినిమాను తెరకెక్కించగా, ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు సందీప్ ఖాతాలోకి కూడా చేరుతున్నాయి.
అర్జున్ రెడ్డి తీయడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే ధైర్యం చేసి తీసాడు. రూ.1.6 కోట్ల కోసం తన తండ్రి, సోదరుడు 36 ఎకరాల మామిడి తోట అమ్మినట్లు గతంలో సందీప్ చెప్పుకొచ్చాడు. అయితే అర్జున్ రెడ్డి హిట్‌తో సందీప్ దశ తిరిగిందని చెప్పాలి. యానిమల్ సినిమాని సందీప్ ,అతని సోదరుడు ఇద్దరు టీ సిరీస్ తో కలిసి నిర్మించారు. ఈ సినిమా 10 రోజుల్లోనే రూ.660 కోట్లు వసూలు చేయడంతో, సందీన్ ఈ సినిమా ద్వారా రూ.200 కోట్ల వరకూ సంపాదించినట్లు సమాచారం. ఇక యానిమల్ మూవీ అందించిన ధైర్యంతో సందీప్ రెడ్డి వంగా రానున్న రోజులలో మరిన్ని పెద్ద సినిమాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…