Leg Cramps : పిక్కలు పట్టేయడం.. దీనినే కాఫ్ పెయిన్ అని కూడా అంటారు. ఈ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. రాత్రి సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. పిక్కలు పట్టేయడానికి వివిధ కారణాలు ఉంటాయి. నీటిని తక్కువగా తాగడం, శరీరంలో ఎలక్ట్రోలైట్ ల అసమతుల్యతల వల్ల పిక్కల్లో కండరాలు సంకోచించి నొప్పిని కలిగిస్తాయి. అలాగే విటమిన్ డి , విటమిన్ బి 12, విటమిన్ ఇ వంటి విటమిన్ లోపాల వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అలాగే వెన్నుపూస నరాలపై ఎక్కువగా ఒత్తిడి పడడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. అదే విధంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తసరఫరా తగ్గినప్పుడు అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయినప్పుడు కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి.
గర్భిణీ స్త్రీలల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారిలో, ధూమపానం చేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే కొందరిలో వ్యాయామాలు చేసేటప్పుడు కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. కాలి మడమలో వాపు వల్ల కూడా పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. అయితే కొందరిలో అప్పుడప్పుడూ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. కానీ కొందరు తరచూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు వైద్యున్ని సంప్రదించాలి. ఒకవేళ పిక్కలు పట్టేయడంతో పాటు తీవ్రమైన నొప్పి, జ్వరం, ఆ భాగంలో నొప్పి రావడం, అదే విధంగా పాదం మరియు కాలి రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే మన శరీరంలో ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా భావించాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి. అయితే పిక్కలు పట్టేయడం అనేది సర్వసాధారణమైన సమస్యే అని ఎటువంటి లక్షణాలు కనిపించకపోతే దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
ముందుగా సమస్య తలెత్తడానికి గల కారణాలు తెలుసుకోవాలి. దీని వల్ల చికిత్స సులభతరం అవుతుంది. పిక్కలు పట్టేసినప్పుడు కదలకుడా ఒకే చోట కూర్చోకుండా కొద్దిగా నడవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. ఉప్పు కలిపిన నీటిని లేదా ఒ ఆర్ ఎస్ కలిపిన నీటిని తాగాలి. అలాగే వేడి నీటి ప్యాక్ ను నొప్పికలిగే చోట ఉంచడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అదే విధంగా శరీరంలో విటమిన్ డి, బి12, ఇ లోపాలు లేకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే వ్యాయామాలు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం చాలా సులభంగా పిక్కలు పట్టేయడం అనే సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…