పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు. అందులో మనుషులకు ఎలాంటి మినహాయింపు లేదు. భూమిపై పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒక సారి చనిపోవాల్సిందే. కాకపోతే కొందరు అర్థాంతరంగా తనువు చాలిస్తుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే ఎవరికైనా సరే ఆయువు ఉన్నంత వరకే జీవిస్తారు. అది ముగిస్తే యముడు పాశం వేసి ప్రాణాలను తీస్తాడు. అయితే మరి ఆయువు తీరింది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది.. ఏమైనా సంకేతాలు కనిపిస్తాయా.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయువు తీరిందని చెప్పేందుకు మన శరీరంలో పలు సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా శక్తి స్థాయిలు పూర్తిగా తగ్గిపోతాయి. పనిచేసేందుకు అసలు ఏమాత్రం శక్తి ఉండదు. తీవ్రమైన నీరసం, అలసట ఉంటాయి. శరీరం అంటేనే భారంగా అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు బరువు దించుకుందామా.. అన్నట్లుగా ఉంటుంది. మరణం సమీపిస్తుంటే బీపీ, హార్ట్ రేట్, శ్వాస క్రియ సక్రమంగా ఉండవు. అసాధారణ రీతిలో ఉంటాయి. పూర్తిగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అలాగే ఉష్ణోగ్రత కూడా క్షణ క్షణానికి మారుతుంటుంది.
మరణం సమీపిస్తుంటే శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే గొంతులో నుంచి జీర లాంటి ఒక ధ్వని వినిపిస్తుంది. ఇది వచ్చిందంటే ఆ మనిషి కొన్ని గంటల్లోనే చనిపోతాడని అర్థం. మృత్యువు సమీపిస్తుంటే మనిషి మానసిక స్థితి దెబ్బ తింటుంది. సరిగ్గా ఆలోచించలేడు. ఒక రకమైన ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. అలాగే ఎంతో దగ్గరి వారు, కుటుంబ సభ్యులు, అత్యంత చనువుగా ఉండే వారిని సైతం గుర్తు పట్టలేకపోతుంటారు. చావు సమీపిస్తుంటే ఆకలి ఉండదు. దాహం అనిపించదు. దీంతో బరువు తీవ్రంగా తగ్గిపోతారు. చావు సమీపిస్తుంటే చర్మం రంగు, ఉష్ణోగ్రత మారుతాయి. చర్మం పాలిపోయినట్లు కనిపిస్తుంది. కళ ఉండదు. ఉష్ణోగ్రత తగ్గి చల్లగా ఉంటుంది.
చావు సమీపించిన వారు ఎల్లప్పుడూ కోమాలో ఉన్నట్లు ఉంటారు. కళ్లు తెరిచి చూడలేరు. అలాగే తమకు యమ ధర్మ రాజు, యమ భటులు, చనిపోయిన వారు కనిపిస్తున్నారని చెబుతారు. ఇలా ఆయువు తీరిన వారికి కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. దీన్ని బట్టి ఆయుష్షు తీరిందని వారు త్వరలోనే చనిపోతారని అర్థం చేసుకోవాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…