Kiwi Fruit : ప్రకృతి మనకు అనేక రకాల పండ్లను అందిస్తుంది. ప్రకృతి మనకు అందించే పండ్లల్లో కివీ పండు కూడా ఒకటి. ఈ పండ్లను మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తాయి. దాదాపు అన్ని కాలల్లోను ఇవి లభిస్తున్నాయి. ఈ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఇతర పండ్ల వలె కివీ పండ్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కివీ పండ్లను తినడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. హై బీపీ మరియు లోబీపీలతో బాధపడే వారు రోజు 3 కివీ పండ్లను తినడం వల్ల బీపీ 20 శాతం తగ్గు ముఖం పడుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. 150 మందికి 8 వారాల పాటు రోజుకు 3 కివీ పండ్లను ఇచ్చి జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడడయ్యాయని నిపుణులు చెబుతున్నారు.
నేటి తరుణంలో చిన్న వయసులోనే చాలా మంది బీపీ బారిన పడుతున్నారు. అధిక బరువు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత చాలా మంది రక్తపోటు వంటి సమస్యల బారిన పడుతున్నారు. ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. కనుక మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా మనం కివీ పండ్లను తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. అలాగే రోజుకు 3 లేదా 4 కివీ పండ్లను 8 వారాల పాటు తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు చెడు కొలెస్ట్రాల్, రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ కూడా 30 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు పరిశోధనల ద్వారా నిరూపించారు. ఇవే కాకుండా ఈ పండ్లను తీసుకోవడం వల్ల పొట్టలో, ప్రేగుల్లో అల్సర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
100 గ్రాముల కివీ పండ్లల్లో 61 క్యాలరీల శక్తి, 83 శాతం నీరు, 93 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అలాగే ఈ పండ్లల్లో ఎఇఎసి అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది విటమిన్ సితో కలిసి జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా చేయడంలో సహాయపడుతుంది. ఈ కివీ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం నుండి మలినాలు తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో కూడా ఇవి మనకు ఎంతగానో సహాయపడతాయి. ఈ విధంగా కివీ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…