Ashwathama : మహాభారతం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దీని గురించి మనం చిన్నతనం నుండే చదువుకుంటున్నాం. ఇప్పటికీ మహాభారతం అంటే చాలా మంది ఆసక్తి చూపిస్తారు. 90లలో దూరదర్శన్‌లో ప్రతి ఆదివారం వచ్చే మహాభారత్ సీరియల్ ను కొన్ని కోట్ల మంది చూశారు. అయితే మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉంటాయి. కానీ వాటిల్లో అశ్వత్థామ పాత్రకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెప్పవచ్చు.
అశ్వత్థామ ఎవరో తెలుసు కదా.. ద్రోణాచార్యుడి కుమారుడు. ద్రోణుడు కురు వంశానికి రాజగురువు. ఆయన పాండవులు, కౌరవులకు ఎన్నో విద్యలు నేర్పించాడు. అర్జునున్ని ఎంతో గొప్ప విలువిద్యకారుడిగా తీర్చిదిద్దాడు. అయితే ద్రోణుడు, ఆయన కుమారుడు అశ్వత్థామ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన యుద్ధం చేస్తారు. చివరకు ఓడిపోతారు. అయితే ఎన్నో వేల ఏళ్ల కిందట ఈ యుద్ధం జరగ్గా అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు.
కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ ద్రౌపది కుమారులు 5 మందిని నిద్రలోనే హతమారుస్తాడు. వారిని ఉప పాండవులు అంటారు. అయితే ఇంతటి పాపానికి ఒడిగట్టిన అశ్వత్థామకు కృష్ణుడు శాపం పెడతాడు. భూమి ఉన్నంత వరకు చావు కోసం ఎదురు చూస్తూ చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ దిక్కు లేకుండా అరణ్యాల్లో సంచరించు.. అని కృష్ణుడు.. అశ్వత్థామకు శాపం ఇస్తాడు. దీంతో అప్పటి నుంచి అశ్వత్థామ ఇప్పటి వరకు ఇంకా జీవించే ఉన్నాడని చెబుతుంటారు. అయితే అశ్వత్థామ ఇంకా ఉన్నాడని కానీ.. ఆయన ఎక్కడైనా కనిపించాడని కానీ.. చెప్పేందుకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు.
అయితే అశ్వత్థామ వద్ద ఒక మణి ఉందట. దాని వల్లే ఆయనకు మరణం ఉండదని.. ఎప్పటికీ మృత్యుంజయుడిగా ఉంటాడని చెబుతారు. అయితే అప్పట్లో హిమాలయాల్లో హనుమంతుడు కనిపించాడని కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ అశ్వత్థామకు చెందిన అలాంటి వార్తలేవీ రాలేదు. అయితే పురాణాల ప్రకారం మాత్రం అశ్వత్థామ ఇంకా జీవించే ఉన్నాడని అంటుంటారు. అరణ్యాల్లో తిరుగుతుంటాడని చెబుతారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…