Konda Pindi Aaku : మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యల్లో మూత్రాశయ ఇన్ఫెక్షన్ల సమస్య కూడా ఒకటి. ఇది పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువగా వస్తుంది. అయితే ఈ సమస్య సహజంగా నీరు ఎక్కువగా తాగకపోవడం వల్ల కూడా వస్తుంది. ఈ ఇన్‌ఫెక్షన్ ఉంటే విపరీతమైన నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట అనిపిస్తాయి. మూత్రం రంగు మారుతుంది. మూత్రం చాలా తక్కువగా వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా అది మూత్రాశయ ఇన్‌ఫెక్షన్ అని అనుమానించాలి.
ఇక ఈ సమస్యను తగ్గించడానికి కొండపిండి ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మనకు ఎక్కడ చూసినా లభిస్తుంది. రహదారుల పక్కన, గ్రామీణ ప్రాంతాల్లో ఈ మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. దీన్ని సేకరించడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇక కొండ పిండి ఆకులో మూత్రాశయ ఇన్ ఫెక్షన్ మీద పోరాటం చేసే లక్షణాలు సమృద్దిగా ఉంటాయి. కొండపిండి ఆకు మనకు ఎక్కడైనా సరే విరివిగా లభ్యం అవుతుంది. ఈ ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించి డికాషన్ చేసుకొని తాగవచ్చు.
కొండపిండి ఆకు లేకపోతే కొండపిండి ఆకు పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. ఈ పొడిని నీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. ఈ విధంగా తాగడం వల్ల మూత్రాశయ ఇన్ ఫెక్షన్ తగ్గడమే కాకుండా కిడ్నీలో రాళ్ళ సమస్య, మూత్రంలో మంట, శరీరంలో వేడి.. ఇలా అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. కనుక ఈ ఆకు ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుని ఉపయోగించండి. దీంతో మూత్రాశయ సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…