వినోదం

Aha Naa Pellanta 1987 Collections : రూ.16 ల‌క్ష‌ల‌తో ఈ సినిమాను తీశారు.. ఎంత వ‌సూలు చేసిందో తెలిస్తే షాక‌వుతారు..!

Aha Naa Pellanta 1987 Collections : కామెడీ మూవీస్ తో బాక్సాఫీస్ హిట్స్ కొట్టవచ్చని హాస్య బ్రహ్మ జంధ్యాల నిరూపించారు. అందుకు తార్కాణం అహ నా పెళ్ళంట సినిమా. కుటుంబ సమేతంగా చూడద‌గ్గ చక్కని హాస్య రస చిత్రాలను ఆయన అందించారు. అహ నా పెళ్ళంట సినిమాతో రాజేంద్ర ప్రసాద్ కెరీర్ టాప్ కి చేరగా.. బ్రహ్మానందం కెరీర్ ఇక వెనక్కి తిరిగి చూసుకోని విధంగా మారింది. ఆదివిష్ణు రాసిన పల్లకి వారపత్రికలో సత్యం గారి ఇల్లు సీరియల్ ని సినిమాగా తీయాలని అనుకుంటున్న సమయంలో సురేష్ ప్రొడక్షన్స్ లో ఓ కామెడీ సినిమా చేసి పెట్టమని డాక్టర్ రామానాయుడు అడగడంతో వెంటనే జంధ్యాల గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

సురేష్ సంస్థలో పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన జంధ్యాలకు అప్పుడు డైరెక్టర్ గా ఛాన్స్ రావడంతో ఆదివిష్ణు సీరియల్ కి ప్రేమ వంటివి కలిపి అహ నా పెళ్ళంట స్క్రిప్ట్ రెడీ చేశారు. హీరో రాజేంద్ర ప్రసాద్ ని అనుకోగా, హీరోయిన్ గా రజనిని సెలెక్ట్ చేశారు. హీరో తండ్రిగా నూతన ప్రసాద్ ను తీసుకున్నారు. పిసినారి లక్ష్మీపతి పాత్రకు రావుగోపాలరావుని అనుకున్నా చివరకు కోట శ్రీనివాసరావుని సెలెక్ట్ చేశారు. మొత్తం జంధ్యాల టీమ్ అందరూ చేరిపోయారు. విక్టరీ వెంకటేష్ కి తెలిసి తానే చేస్తానన్నాడట. అయితే ఇది రాజేంద్రప్రసాద్ కి కరెక్ట్ గా ఉంటుందని చెప్పడంతో 1987 జూలై 7న హైదరాబాద్ కి సమీపంలోని ఓ గ్రామంలో షూటింగ్ స్టార్ట్ అయింది.

షూటింగ్ వేగంగా సాగిపోతుంటే లక్ష్మీపతి అసిస్టెంట్ పాత్రకు సెలెక్ట్ చేసిన సుత్తివేలు బిజీ అయిపోవడంతో సత్యాగ్రహం సినిమాలో చేసిన అత్తిలి లెక్చరర్ గుర్తొచ్చి అసోసియేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణను పిలిచి అత్తిలి లెక్చరర్ కి కబురు పంపించారు. లెక్చరర్ కనుక సూటు బూటుతో వచ్చాడు. అయితే బార్బర్ ని పిలిచి జంధ్యాల ఏదో చెప్పడంతో బ్రహ్మానందంను పక్కకు తీసుకెళ్లి 20 నిమిషాల తర్వాత తీసుకొస్తే అక్కడున్నవారంతా పగలబడి నవ్వారు.

మద్రాసులో ప్రివ్యూ వేస్తే సైలెంట్ గా చూస్తూనే ఉండడంతో బ్రహ్మానందం ఆశ్చర్యపోయాడు. బయట థియేటర్లలో రెస్పాన్స్ బాగానే వస్తుందని జంధ్యాల చెప్పారు. సినిమా రిలీజ్ అయ్యాక జనం పగలబడి నవ్వుతూ చూశారు. రామానాయుడికి నవ్వుతోపాటు కాసుల వర్షం కురిపించింది. రూ.16 లక్షలతో ఈ సినిమా తీస్తే రూ.5 కోట్లు వ‌చ్చాయి. జంధ్యాలకి ఎనలేని క్రేజ్ ఏర్ప‌డింది. రమేష్ నాయుడు సాంగ్స్ సూపర్ గా వ‌చ్చాయి. బ్రహ్మానందంకి వరుస ఆఫర్స్ రావ‌డం మొద‌లైంది. పిసినారి పాత్రలో కోట అదరగొట్టేశాడు. ఇక నూతన ప్రసాద్ యాక్షన్ అదుర్స్. ఇలా అన్నీ కలగలిపి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. దీంతో ఎంతో మందికి ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ లా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM