ధనం.. ఇది అందరికీ అవసరమే. రోజు గడవాలంటే డబ్బు కావాలి. అయితే ఆ డబ్బుకు సంబంధించి అందరికీ సమస్యలు ఉంటాయి. చాలామందికి ఎంత కష్టపడ్డా ఆర్థిక సమస్యలు తీరవు. వాటికి రకరకాల కారణాలు ఉంటాయి. అయితే భగవంతుడి అనుగ్రహం ఉంటే తప్పక సంపదలు సొంతం అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఈ కింద చెప్పిన విధంగా పరిహారాలు పాటించి ఆర్థిక సమస్యలను దూరం చేసుకోవచ్చు. దీంతో సంపద చేతిలో నిలుస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ లభిస్తుంది. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా అది నిలవదు.. ఏవేవో కారణాతో వచ్చిన డబ్బు వచ్చినట్లు వెళ్లిపోతుంటుంది. అలాంటప్పుడు ఏమైనా దోషాలు ఉంటే వాటిని పరిహారం చేసుకోవడం ఉత్తమం. అదేవిధంగా.. కొన్ని కార్యాలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. నిత్యం ఇంట్లో దీపారాధన, సాంబ్రాణి లేదా అగరవత్తులు వెలిగించడం చేయాలి. ప్రతి శుక్రవారం గడపలకు పసుపు పూయడం, అలంకరణ, తులసి మొక్క దగ్గర దీపారాధన చేయడం చేయాలి. అలాగే దగ్గర్లోని ఏదైనా గుడిని రోజూ శుభ్రం చేసి ముగ్గుపెట్టాలి.
ఆలయ ప్రాంగణంలో పూలమొక్కలు, అరటి మొక్కలు నాటాలి. స్థలం చిన్నదైతే పూల మొక్కలు నాటినా ఫర్లేదు. రోజూ వాటికి నీరు పోస్తూ మొదటిగా పూచే పూలు, కాచే పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. అదేవిధంగా గోసేవ, చేతనైనంతలో పేదలకు ఆహారం అందించడం, రోగులకు, వికలాంగులకు సహాయం అందించడం చేయాలి. ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతోఉండాలి. ఎదుటివారి అభ్యున్నతిని చూసి ఈర్ష్య పడకూడదు.
అందరూ బాగుపడాలనే ఆలోచన ఉండాలి. అంతేకాకుండా నిత్యం లక్ష్మీ, విష్ణు ఆరాధన, ప్రతి సోమవారం శివాభిషేకం చేయడం వల్ల సంపదలు కలుగుతాయి. శివారాధన ఐశ్యర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీగణపతి ఆరాధన చేయడం మంచిది. ఇవేకాకుండా లక్ష్మీదేవిని ఎర్రటి పూలు, గులాబీలతో ఆరాధించడం చేయాలి. వీలైతే శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చేస్తే తప్పక ఏడాదిలోపే మీ సమస్యలు అన్నీ పటాపంచలు అవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఇలా చేసి లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనం బాగా సంపాదిస్తారు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…