Cashew Nuts : జీడిపప్పు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు..? చాలా మందికి జీడిపప్పు ఫేవరెట్. జీడిపప్పుని తింటే ఎన్నో రకాల లాభాలని పొందొచ్చు. చాలా రకాల పోషక పదార్థాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పును తీసుకోవడం వలన శరీరానికి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. పరగడుపున జీడిపప్పును తింటే మాత్రం కొన్ని సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు జీడిపప్పుని తీసుకోకూడదు. జీడిపప్పుని తీసుకోవడం వలన ఇబ్బందులు పడతారు.
జీడిపప్పులో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దానితోపాటుగా మెగ్నీషియం, కాపర్, జింక్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, సెలీనియం కూడా జీడిపప్పులో ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు జీడిపప్పుని అస్సలు తీసుకోకూడదు. జీడిపప్పుని వాళ్ళు తీసుకోవడం వలన రక్తపోటు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పులో సోడియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటు పెరుగుతుంది. గ్యాస్ సమస్యలు ఉంటే కూడా జీడిపప్పును తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే సమస్య ఏర్పడుతుంది.
జీడిపప్పులో అధికంగా ఫైబర్ ఉండడం వలన గ్యాస్ సమస్యల్ని బాగా పెంచేస్తుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు కూడా జీడిపప్పుకి దూరంగా ఉండాలి. పొటాషియం ఇందులో ఎక్కువ ఉండటం వలన కిడ్నీ సమస్యలను ఇంకొంచెం పెంచేస్తుంది. దాంతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రోజూ ఎంత జీడిపప్పు తినొచ్చు అనే విషయానికి వస్తే.. ఆరోగ్యంగా ఉండే వాళ్ళు నాలుగు నుండి ఐదు జీడిపప్పుల్ని తీసుకోవచ్చు. కానీ సమస్యలు ఏమైనా ఉన్నవాళ్లు డాక్టర్‌ని అడిగి డాక్టర్ చెప్పినట్లు పాటించడం మంచిది.
లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. జీడిపప్పుని చాలామంది టైంపాస్ కి తీసుకుంటూ ఉంటారు. జీడిపప్పును వేయించి ఉప్పు, మసాలా వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మసాలా వంటి వాటిని జీడిపప్పుతోపాటు తీసుకుంటే పలు సమస్యలు కలుగుతాయి. కాబట్టి కేవలం జీడిపప్పును మాత్రమే తీసుకోవడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…