Weight Gain : మనలో చాలా మంది బరువు పెరగడానికి కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉండాల్సిన బరువు కంటే కూడా తక్కువ బరువు ఉంటారు. అయితే కొందరిలో బరువు తక్కువగా ఉండడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. రక్తహీనత, నీరసం, బలహీనత, ఏపని మీద శ్రద్ద పెట్టలేకపోవడం, పోషకాహార లోపం వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం మన వయసుకు తగినంత బరువు ఉండడం చాలా అవసరం. చాలా మంది బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే వివిధ రకాల మందులను, సిరప్ లను, పౌడర్లను వాడుతూ ఉంటారు. కానీ వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం లేక మరలా నిరుత్సాహ పడుతూ ఉంటారు. అలాగే మరికొందరు బరువు పెరగాలని జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
జంక్ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మనం వీలైనంత వరకు ఆరోగ్యంగా బరువు పెరగాలి. బరువు పెరగాలనుకునే వారు ప్రోటీన్ లు మరియు మంచి కొవ్వులు ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలన్నా ముందుగా మనకు ఆకలి ఎక్కువగా ఉండాలి. కనుక రోజూ ఉదయమే లీటర్ నుండి లీటర్నర నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట పూర్తిగా శుభ్రమవుతుంది. దీంతో ఆకలి పెరుగుతుంది. బరువు పెంచేలా చేయడంలో మనకు పల్లీలు ఎంతో సహాయపడతాయి. వీటిలో ప్రోటీన్లు, ఫ్యాట్ లు ఎక్కువగా ఉంటాయి. పల్లీలల్లో 50 శాతం ఫ్యాట్, 25 శాతం ప్రోటీన్ ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరిలో కూడా ఫ్యాట్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కనుక రోజూ ఉదయం నానబెట్టిన పల్లీలను, కొబ్బరిని కలిపి తీసుకోవాలి.
వీటితో పాటు మనకు నచ్చిన వివిధ రకాల పండ్లను తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం పూట కొర్రలు, సామలు, జొన్నలు, బియ్యంతో వండిన 70 శాతం తీసుకోవాలి. కూరలను 30 శాతం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సినన్ని కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. నీరసం తగ్గుతుంది. అదే విధంగా సాయంత్రం పూట పుచ్చగింజల పప్పు, పొద్దు తిరుగుడు పప్పు, గుమ్మడి గింజలు, డ్రై నట్స్ ను నానబెట్టి తీసుకోవాలి. అలాగే 2 నుండి 3 అరటి పండ్లను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు పెరగవచ్చు. కనీసం నెలకు రెండు కిలోల వరకు బరువు సులభంగా పెరగవచ్చు. ఈ విధంగా చక్కటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కగా కండపడతారు. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. వేగంగా బరువు పెరగవచ్చు. బరువు పెరగాలనుకునే వారు ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…