Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్.. ఈ పేరు చెప్పగానే చాలా మంది ఇది చైనాకు చెందిన పండు అని అనుకుంటారు. కానీ ఇది ఎంతమాత్రం నిజం కాదు. పేరులో డ్రాగన్ ఉన్నప్పటికీ ఈ పండు చైనాకు చెందినది కాదు. మెక్సికోలో పుట్టింది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇది అందుబాటులో ఉంది. మనకు ప్రస్తుతం ఈ పండ్లు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ పండ్లను తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండ్ల వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రాగన్ ఫ్రూట్ పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు సి, ఇ, బి6లతోపాటు ఐరన్, మెగ్నిషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పోషకాహార లోపం రాకుండా చూస్తాయి. వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. దీంతో తెల్ల రక్తకణాల ఉత్పత్తి మెరుగు పడుతుంది. దీని వల్ల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగు పరుస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే గ్యాస్ సమస్య కూడా తగ్గుతుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో బీటాలెయిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్ సి కూడా యాంటీ ఆక్సిడెంట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇవన్నీ ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీంతో క్యాన్సర్, గుండె పోటు వంటి ప్రాణాంతక వ్యాధులు రావు. ఈ పండ్లలో నీరు అధికంగా ఉంటుంది. కనుక వేసవిలో దీన్ని తింటే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఈ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులను రాకుండా నిరోధిస్తాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా గణనీయంగా తగ్గుతాయి.
ఈ పండ్లలో బీటాసయనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటి వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. దీంతోపాటు చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఈ పండ్లలో క్యాలరీలు తక్కువగా ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీంతో శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. బరువు తగ్గుతారు. ఈ పండ్లను తినడం వల్ల లివర్ పనితీరు మెరుగు పడుతుంది. లివర్ ఆరోగ్యంగా మారుతుంది.
ఇలా డ్రాగన్ ఫ్రూట్‌తో మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని నేరుగా తినవచ్చు. పైన తొక్క తీసేస్తే లోపల తెల్లని గుజ్జు ఉంటుంది. మధ్యలో నల్లని విత్తనాల మాదిరిగా ఉంటాయి. ఈ పండు చప్పగా ఉంటుంది. కనుక ఇందులో తేనె లేదా చక్కెర కలిపి తినవచ్చు. ఇలా డ్రాగన్ ఫ్రూట్‌ను తినాల్సి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…