ఆఫ్‌బీట్

Marriage : త‌న‌క‌న్నా ఎక్కువ వ‌య‌స్సు ఉన్న స్త్రీని పురుషుడు పెళ్లి చేసుకోవ‌చ్చా..?

Marriage : పూర్వ‌కాలం నుంచి మన పెద్ద‌లు ఎన్నో ఆచారాల‌ను, సంప్ర‌దాయాల‌ను పాటిస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఇలాంటి వాటిని పాటించేవారు త‌క్కువ‌య్యారు. కానీ కొన్ని ఆచారాలు మాత్రం ఇప్ప‌టికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే స్త్రీ, పురుషుల పెళ్లిళ్ల విష‌యంలో అనేక న‌మ్మ‌కాల‌ను పాటించేవారు. స్త్రీ ఎల్ల‌ప్పుడూ త‌న‌క‌న్నా వ‌య‌స్సులో ఎక్కువ ఉన్న పురుషుల‌నే పెళ్లి చేసుకోవాల‌ని.. త‌క్కువ వ‌య‌స్సు ఉన్న పురుషుల‌ను చేసుకోరాద‌ని.. అలా చేసుకుంటే అరిష్టం క‌లుగుతుంద‌ని చెబుతుంటారు. అయితే ఇలా చేసుకుంటే నిజంగానే అరిష్టం క‌లుగుతుందా.. అస‌లు దీని వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వ‌కాలంలో స్త్రీలు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యేవారు. కుటుంబ భారం, పోష‌ణ‌, ఖ‌ర్చులు.. అన్నీ పురుషులే చూసుకునేవారు. అలాంటి స‌మ‌యంలో పురుషుడు త‌న‌క‌న్నా వ‌య‌స్సులో ఎక్కువ ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే అప్పుడు కుటుంబ భారం ఆమె మీద ప‌డుతుంది. అది ఆ రోజుల్లో చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌యం. క‌నుక అప్ప‌ట్లో పురుషులు త‌మ‌క‌న్నా వ‌య‌స్సులో చిన్న వారైన స్త్రీల‌నే పెళ్లి చేసుకోవాల‌ని నిబంధన పెట్టారు. దీంతో పురుష‌ల‌పైనే కుటుంబ భారం ప‌డుతుంది. ఇది ఇబ్బంది క‌లిగించ‌దు. క‌నుక ఈ నిబంధ‌న అప్ప‌ట్లో వ‌చ్చింది.

Marriage

ఇక స్త్రీ త‌న‌క‌న్నా వ‌య‌స్సులో పెద్ద‌దైతే ఆమెను ఓదార్చ‌డం, బ‌తిమాలడం అప్పట్లో అవ‌మానంగా భావించేవారు. అలాగే భ‌ర్త కాళ్ల‌కు భార్య మొక్కుతుంది. అలాంటి ప‌రిస్థితిలో భార్య వ‌య‌స్సు ఎక్కువ‌గా ఉంటే అప్పుడు చిన్న‌వారికి మొక్కిన‌ట్లు అవుతుంది. ఇది అరిష్టం. క‌నుక పెళ్లి చేసుకునే పురుషులు త‌మ‌క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు ఉన్న స్త్రీల‌నే పెళ్లి చేసుకునేవారు. దీంతో స్త్రీలు తాము చెప్పిన మాట వింటార‌ని పురుషులు అనుకునేవారు. అలాగే కాళ్ల‌కు మొక్కే విష‌యంలోనూ ఇబ్బంది ఉండేది కాదు. అందుక‌నే అప్ప‌ట్లో అలా పెళ్లి చేసుకునేవారు. అయితే అప్ప‌ట్లో ఇది చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు పాటించాల్సిన అవ‌స‌రం లేదు. అస‌లు ఒక స్త్రీ, పురుషుడు క‌ల‌సి ఉండేందుకు వ‌య‌స్సుతోనూ ఎలాంటి సంబంధం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌నుక ఆరోగ్య‌క‌ర‌మైన దాంప‌త్యం ఉన్నంత వ‌ర‌కు స్త్రీ, పురుషులు ఇలాంటి వ‌య‌స్సు భేదాలు ప‌ట్టించుకోవాల్సిన ప‌నిలేదు. అది అప్ప‌ట్లో ఉన్న ఆచారం. కానీ ఇప్పుడు పాటించాల్సిన అవ‌స‌రం లేదు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM