ఆరోగ్యం

Hair Growth : దీన్ని రాస్తే చాలు.. జుట్టు వ‌ద్ద‌న్నా పొడ‌వుగా పెరుగుతూనే ఉంటుంది..!

Hair Growth : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. జుట్టు తెగ‌డం, చిట్ల‌డం త‌గ్గుతుంది. తెల్ల‌బ‌డిన జుట్టు న‌ల్ల‌గా మారుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్య‌వంతంగా పెరుగుతుంది. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డం అలాగే వాడడం కూడా చాలా సుల‌భం. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు ఉండ‌వు. మ‌న జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌రిచి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసే ఈ చిట్కా ఏమిటి… దీనిని ఎలా త‌యారు చేసుకోవాలి…ఎలా వాడాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి మ‌నం కేవ‌లం రెండే రెండు ప‌దార్థాల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. అందులో మొద‌టిది క‌ల‌బంద‌. క‌ల‌బంద జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది.

జుట్టుకు కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించి జుట్టును బ‌లంగా, ధృడంగా, మెరిసేలా చేయ‌డంలో క‌ల‌బంద ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. అలాగే మ‌నం ఉప‌యోగించాల్సిన రెండో ప‌దార్థం కొబ్బ‌రి నూనె. జుట్టు పెరుగుద‌ల‌కు కొబ్బ‌రి నూనెను ఎంతో కాలంగా ఉప‌యోగిస్తున్నారు. కొబ్బ‌రి నూనెను వాడ‌డం వ‌ల్ల జుట్టు పొడిబార‌కుండా ఉంటుంది. జుట్టు కావల్సిన పోష‌కాలు అంది జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు ప‌దార్థాల‌ను క‌లిపి జుట్టుకు రాసుకోవాలి. దీని కోసం క‌లబంద ముక్క‌ను తీసుకుని అంచుల‌ను తొల‌గించి లోప‌ల ఉండే గుజ్జును తీసుకోవాలి. ఈ గుజ్జును జార్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. మిక్సీ ప‌ట్టుకున్న ఈ క‌ల‌బంద గుజ్జును 3 లేదా 4 టేబుల్ స్పూన్ల మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తాజా క‌ల‌బంద గుజ్జు ల‌భించ‌ని వారు మార్కెట్ లో ల‌భించే క‌ల‌బంద జెల్ ను అయిన ఉప‌యోగించ‌వ‌చ్చు.

త‌రువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి నూనెను వేసి బాగా క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని మ‌నం నిల్వ కూడా చేసుకోవ‌చ్చు. తిరిగి ఉప‌యోగించాలి అనుకున్న‌ప్పుడు కొద్ది సేపు ఎండ‌లో ఉంచి ఆ త‌రువాత ఉప‌యోగించాలి. ఇలా క‌ల‌బంద‌, కొబ్బ‌రి నూనె క‌లిపి త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి జుట్టు చివ‌రి వ‌ర‌కు బాగా ప‌ట్టించాలి. త‌రువాత ఈ మిశ్ర‌మం జుట్టు కుదుళ్ల‌లోకి ఇంకేలా మ‌ర్ద‌నా చేసుకోవాలి. దీనిని ఇలాగే 2 గంట‌ల పాటు ఉంచిన త‌రువాత ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా ఉండే షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడుసార్లు చేయ‌డం వ‌ల్ల మన జుట్టు పెరుగుద‌ల‌లో వ‌చ్చిన మార్పును మ‌నం చాలా సుల‌భంగా గ‌మ‌నించ‌వ‌చ్చు. జుట్టు స‌మ‌స్య‌ల్నింటిని దూరం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM