Eye Sight : ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో నేడు అధిక శాతం మంది ఎదుర్కొంటున్న ప్రధాన అనారోగ్య సమస్యల్లో నేత్ర సంబంధమైనవి కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ రోజుల్లో అప్పుడే పుట్టిన శిశువుల్లో కూడా ఈ సమస్య ఎదురవడం సర్వ సాధారణమైపోయింది. ఇక యువత, పెద్దల్లో అధిక శాతం మంది చిన్న వయస్సులోనే కంటి అద్దాలు, కాంటక్ట్ లెన్స్‌లు ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు నేత్ర సంరక్షణపై దృష్టి సారించాల్సి వస్తోంది. అయితే కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన టిప్స్‌ను పాటిస్తే నేత్ర సంబంధ సమస్య ఏదైనా సులభంగా దూరమవుతుంది. ఆ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను తాగితే దృష్టి సంబంధ సమస్యలు వెంటనే దూరమవుతాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి నేత్ర సంబంధ సమస్యలను పరిష్కరిస్తాయి. చూపు స్పష్టతను పెంచుతాయి. నేటి తరుణంలో స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల వాడకం ఎక్కువైంది. దీనికి తోడు బయట తిరగడం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటే ఆ ప్రభావం కళ్లపై కూడా పడుతుంది. రోజూ కనీసం 3 గంటల పాటు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకుంటే ఈ ఒత్తిడి నుంచి సులభంగా బయటపడవచ్చు. రోజులో కొంత సమయం పాటు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతిని చూడండి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఎంతగానో హాయి కలుగుతుంది. ఇది నేత్రాలకు పూర్తి స్థాయిలో హాయినిస్తుంది.
కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్‌లను ఎక్కువగా ధరించే వారు రోజులో కొంత సమయం పాటు వాటికి దూరంగా ఉండేందుకు యత్నించండి. దీని వల్ల లెన్స్‌ల ద్వారా కళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. కంప్యూటర్లపై ఎక్కువగా పనిచేసేవారు అవసరమైతేనే వాటిని వాడాలి. లేదంటే దూరంగా ఉండాలి. వీలైనంత వరకు కంప్యూటర్ స్క్రీన్ల నుంచి దూరంగా ఉండేందుకు యత్నించాలి. కళ్లను నిత్యం కొంత సమయం పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే కళ్లకు విశ్రాంతి కలుగుతుంది. రోజూ ఒక అరగంట పాటు గోరు వెచ్చని తడి గుడ్డతో కళ్లను సున్నితంగా ఒత్తినట్టు చేయాలి. ఇది కళ్లకు హాయినిస్తుంది. ఇలా పలు చిట్కాలను పాటించడం వల్ల కంటి సమస్యలు పోతాయి. కంటి చూపు అమాంతం పెరుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…