Coconut Water Or Lemon Water : వేసవికాలంలో మనం ఎదుర్కొనే సమస్యలల్లో డీహైడ్రేషన్ ఒకటి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వేసవిలో ఈ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ వీలైనంత వరకు నీటిని ఎక్కువగా తాగడానికి ప్రయత్నించాలి. డీహైడ్రేషన్ బారిన పడినప్పుడు కొందరు నీటితో పాటు కొబ్బరి నీళ్లను, నిమ్మకాయ నీళ్లను తాగుతూ ఉంటారు. వీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ నుండి బయటపడుతుంది. ఇతర శీతల పానీయాల కంటే ఇవి రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు.. ఈ రెండింటిలో ఏవి మంచివి.. వేటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు కలుగుతుంది.. అన్న సందేహం మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లల్లో ఏవి మంచివి.. వేటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుంది.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి వాటి యొక్క ఎలక్ట్రోలైట్ లక్షణాలకు ప్రసిద్ది. డీహైడ్రేషన్ ను తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అలాగే కొబ్బరి నీళ్లల్లో పొటాషియం, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ద్రవాలను సమతుల్యం చేయడంలో, తక్షణ శక్తిని అందించడంలో, కండరాలకు మేలు చేయడంలో కొబ్బరినీళ్లు మనకు సహాయపడతాయి. అదేవిధంగా నిమ్మకాయ నీళ్లు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. విటమిన్ సి, ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. నిమ్మకాయ నీళ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా నిమ్మకాయ నీళ్లను తీసుకోవడం వల్ల శరీరం యొక్క పిహెచ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వేసవికాలంలో నిమ్మకాయ నీళ్లను తీసుకోవడం వల్ల కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఇక ఏది మంచిది అన్న విషయానికి వస్తే ఇవి రెండు కూడా మనల్ని డీహైడ్రేషన్ సమస్య నుండి బయటపడేస్తాయని ఇవి రెండు కూడా మంచివే అని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ అందింతే, నిమ్మకాయ నీటిని తాగడం వల్ల శరీరం హైడ్రెటెడ్ గా ఉంటుంది. వ్యాయమం చేసేటప్పుడు, వ్యాయామం చేసిన తరువాత శరీరం చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ ను ఎక్కువగా కోల్పోతుంది. అప్పుడు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల ఎలక్ట్రోలైట్స్ తిరిగి అందుతాయి. అదే సమయంలో నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కణాల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోజూ ఉదయం పరగడుపున కొబ్బరి నీటిని తాగడం వల్ల రోజంతా అలిసిపోకుండా ఉండవచ్చు. అలాగే చురుకుగా ఉండాలనుకునే వారు రోజులో ఎప్పుడైనా నిమ్మకాయ నీటిని సిద్దం చేసుకుని తీసుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…