జ్యోతిష్యం & వాస్తు

Monkey In Dream : క‌ల‌లో కోతి క‌నిపించిందా.. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Monkey In Dream : రాత్రిపూట నిద్ర‌లో క‌ల‌లు రావ‌డం స‌హ‌జం. ఇది అంద‌రికి ఎప్పుడూ ఒక్క‌సారి జ‌రుగుతూనే ఉంటుంది. కొన్ని క‌ల‌లు మ‌న‌కు ఆనందాన్ని క‌లిగిస్తే, మ‌రికొన్ని బాధ‌ను క‌లిగిస్తాయి. ఒక్కోసారి మ‌న‌కు వ‌చ్చిన చెడు మ‌రియు భ‌యంక‌ర‌మైన క‌ల‌ల కార‌ణంగా నిద్ర‌లో ఉలిక్కిప‌డి లేస్తుంటాము కూడా. అలాగే క‌ల‌ల శాస్త్రం ప్ర‌కారం మ‌న‌కు వ‌చ్చే క‌ల ఒక సంకేతం. మ‌న‌కు క‌ల‌లో క‌నిపించే ప్ర‌తి దానికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అలాగే క‌ల‌లో కొంద‌రికి కోతులు క‌నిపిస్తూ ఉంటాయి. క‌ల‌లో కోతులు క‌నిపిస్తే మంచి జ‌రుగుతుందో, చెడు జ‌రుగుతుందో చాలా మందికి తెలియ‌దు. అయితే క‌ల‌లో కోతులు క‌నిపించ‌డం మంచిదా.. కాదా.. ఇది దేనికి సంకేతం.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు కోతిని కూడా ప‌విత్రంగా భావిస్తారు.

కోతిని హ‌నుమంతుడి ప్ర‌తీక‌గా భావిస్తారు. క‌నుక క‌ల‌లో కోతి క‌నిపించ‌డం విశేషం. అయితే క‌ల‌లో కోతిని వేర్వేరు స్థానాల్లో చూడ‌డం వ‌ల్ల వేర్వేరు అర్థాలు వ‌స్తూ ఉంటాయి. క‌ల‌లో కోతి న‌వ్వుతున్న‌ట్టు క‌నిపిస్తే అది శుభ‌దాయ‌కం. జీవితంలో మంచి జ‌ర‌గ‌బోతుంద‌ని అర్థం. ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని అర్థం. స్నేహితుల‌తో ఉన్న వివాధాలు త‌గ్గ‌డంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు వ‌స్తాయ‌ని ఇవి సూచిస్తాయి. అలాగే కోతుల స‌మూహం క‌నిపిస్తే కూడా శుభ‌దాయకం. కుటుంబం నుండి పూర్తి మ‌ద్ద‌తు ల‌భిస్తుంద‌ని దీని అర్థం. అంతేకాకుండా ఆర్థికంగా మంచి చేకూరుతుంద‌ని, నిలిచిపోయిన డ‌బ్బు చేతికి అందుతుంద‌ని దీని అర్థం. అలాగే క‌ల‌లో కోతి ఏదైనా తింటూ క‌నిపించ‌డం అంత మంచిది కాదు.

Monkey In Dream

ఇది మ‌న‌కు న‌ష్టాన్ని క‌లిగిస్తుంద‌ని అర్థం. అలాగే మీ కుటుంబం భ‌విష్య‌త్తులో సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంద‌ని అర్థం. అంతేకాకుండా ఆర్థికంగా న‌ష్టాలు కూడా క‌ల‌గ‌వ‌చ్చని దీని అర్థం. అలాగే కోపంగా ఉన్న కోతి క‌ల‌లో క‌నిపిస్తే అశుభం. కోపంగా ఉన్న కోతి క‌ల‌లో క‌నిపిస్తే మీకు ద‌గ్గ‌ర‌గా ఉన్న వారితో గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని దాని అర్థం. అంతేకాకుండా మీ గౌర‌వ మ‌ర్యాద‌లు కూడా దెబ్బ‌తింటాయి. ఈ విధంగా క‌ల‌లో క‌నిపించే ఒక్కో కోతి ఒక్కో అర్థాన్ని సూచిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM