Kushmanda Devi : చైత్ర నవరాత్రి 9 రోజుల్లో దుర్గా మాతలందరిని పూజిస్తూ ఉంటారు. ఇందులో నవరాత్రి నాలుగవరోజు కూష్మాండ దేవిని పూజిస్తారు. కూష్మాండ దేవినా ఆరాధించడం వల్ల ఆ తల్లిని దర్శించడం వల్ల కష్టాల నుండి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ తల్లిని ఆరాధించిన భక్తులకు మోక్షాన్ని కూడా అందిస్తుంది. భక్తులను కష్టాల నుండి దూరం చేసే ఈ కుష్మాండ తల్లి ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుష్మాండ తల్లి దేవాలయాలల్లో విభిన్నమైన శోభ కనిపిస్తుంది. ఈ దేవాలయాలపై ఆసక్తికరమైన కథలతో పాటు దేవాలయాల్లో కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. రహస్యాలను ఇప్పటికి ఎవరూ కనుగొనలేదు. నవరాత్రి సమయంలో ఈ దేవాలయాలకు భక్తుల రాక ఎక్కువగా ఉంటుంది. కూష్మాండ దేవి ఆలయం బనారస్ లోని రామ్ నగర్ లో ఉంది. సుబాహు అనే రాజు కఠోరమైన తపస్సు చేసి ఆ దేవత తన రాజధాని వారణాసిలో అదే పేరుతో నివాసించాలని వరాన్ని కోరినట్టు ఇక్కడి స్థలపురాణం చెబుతుంది.
అలాగే దేవాలయంలో ఉండే తల్లి విగ్రహం ఎవరిచేత చేయబడలేదని నమ్ముతారు. దుష్టశక్తుల నుండి ప్రజలను రక్షించడానికే విగ్రహం కనిపించిందని నమ్ముతారు. ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ దేవాలయంలో చాలా ఎక్కువ సంఖ్యలో కోతులు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. అదే విధంగా ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లోని అగస్త్యముని లోని సిల్లాగ్రామంలో కూష్మాండ దేవిని ఆనంద దేవతగా పూజిస్తారు. సిల్లా గ్రామంలో అగస్త్య మహర్షి గర్భం నుండి కూష్మాండ దేవి జన్మించిందని నమ్ముతారు. అలాగే ఇక్కటి ప్రజలు కుమాసైన్ అనే పేరుతో కూడా తల్లిని పూజిస్తారు. కూష్మాండ దేవి జననం గురించి ఇక్కడ ఒక చక్కటి కథ ప్రాచుర్యంలో ఉంది. హియాలయ ప్రాంతంలో రాక్షసుల భయం ఉన్నప్పుడు, ఋషులు ఆశ్రమంలో పూజలు చేయలేమని చెబుతారు. శనీశ్వర్ మహారాజ్ ఆలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడికి పూజకు వచ్చిన ఒక బ్రహ్మణుడిని రాక్షసులు చంపేస్తారు. అప్పుడు శనీశ్వర్ మహారాజ్ తన సోదరుడు అగస్త్య మహర్షిని సహాయం కోరతాడు.
తరువాత అగస్త్య మహర్షి సిల్లా గ్రామానికి చేరుకుని పూజలు చేయడం ప్రారంభిస్తాడు. కానీ అతడు కూడా రాక్షసులకు భయపడతాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఆదిశక్తి జగదాంబను ధ్యానం చేస్తాడు. అప్పుడు ఆ తల్లి తన గర్భాన్ని రుద్ది కూష్మాండకు జన్మనిస్తుందని ఇలా కూష్మాండ దేవి జన్మించిందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో కూడా పురాతన కూష్మాండ దేవి ఆలయం ఉంది. ఇక్కడ తల్లి పిండి రూపంలో ఉంటుంది. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాలు రెండవ శతాబ్దం నుండి పదవ శతాబ్దానికి చెందినవిగా చెబుతారు. అలాగే ఈ ఆలయాన్ని కుధ అనే గోవుల కాపరి పెట్టాడని చెబుతారు. పొదలో ఉన్న తల్లికి ఆవు తన పొదుగు నుండిపాలను ఇస్తుండగా గోరక్షకుడు చూసి ఆశ్చర్యపోయాడు. అలాగే అక్కడ తవ్వి చూడగా కూష్మాండ దేవి విగ్రహం కనిపించింది కానీ దానికి ముగింపు కనిపించలేదు. దీంతో ఆఆవుల కాపరి అక్కడే గుడిని కట్టి కూష్మాండ దేవిని పూజించడం ప్రారంభించాడు. అలాగే ఈ ఆలయంలో పిండి రూపంలో ఉండే కూష్మాండ దేవి నుండి ఎప్పుడూ నీరు కారుతూ ఉంటుంది. ఈ నీటిని తాగడం వల్ల ఎటువంటి రోగాల నుండైన విముక్తి కలుగుతుందని నమ్ముతారు. నవరాత్రి సమయంలో ఇక్కడికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…