ఆరోగ్యం

Breast Cancer : మ‌హిళ‌ల్లో వచ్చే రొమ్ము క్యాన్స‌ర్‌ను 90 శాతం వ‌ర‌కు త‌గ్గించే విట‌మిన్ గురించి తెలుసుకోండి..!

Breast Cancer : నేడు మ‌న‌కు క‌లిగే ఎన్నో ర‌కాల అనారోగ్యాలకు, సంభ‌వించే వ్యాధులకు వెనుక ఏదో ఒక కార‌ణం ఉంటుంది. కొంద‌రికి పుట్టుక‌తో వ్యాధులు సోకితే ఇంకొంత మందికి ఆహార‌పు అల‌వాట్లు, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా, మ‌రికొంద‌రికి ప్ర‌మాదాల వ‌ల్ల‌, ఇంకా కొంద‌రికి జీన్స్‌, వంశ పారంప‌ర్య ల‌క్ష‌ణాల వ‌ల్ల రోగాలు వ‌స్తున్నాయి. అయితే వీటన్నింటితోపాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు స‌రిగా అంద‌కున్నా మ‌నం వివిధ ర‌కాల అనారోగ్యాల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అలాంటి పోష‌కాల్లో చెప్పుకోద‌గినది విట‌మిన్ డి. అవును, విట‌మిన్ డి ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే మ‌హిళ‌ల్లో వ‌చ్చే రొమ్ము క్యాన్స‌ర్‌ను దాదాపు 90 శాతం వ‌ర‌కు న‌యం చేయ‌వ‌చ్చ‌ట‌. దీంతోపాటు ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ట‌. ఇది ఇత‌ర అనారోగ్యాల‌ను కూడా ద‌రిచేర‌నీయ‌ద‌ట‌.

గ్రాస్ రూట్స్ హెల్త్ అనే స్వ‌చ్ఛంద సంస్థ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షురాలు కారోల్ బాగ‌ర్లీ ఒక‌ప్పుడు రొమ్ముక్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుండేది. అయితే డి విట‌మిన్ ఉన్న ఆహారాన్ని ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల ఇప్పుడామె త‌న రొమ్ము క్యాన్స‌ర్‌ను దూరం చేసుకోగ‌లిగింది. ఈ నేప‌థ్యంలోనే గ్రాస్ రూట్స్ హెల్త్ అనే స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ను స్థాపించి దాని ద్వారా సేవ‌ల‌ను అందించ‌డం ప్రారంభించింది. త‌న‌లాగే రొమ్ము క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఇత‌ర మ‌హిళ‌ల‌కు విట‌మిన్ డిని నిత్యం తీసుకోవాల‌ని చెబుతూ వారికి ఆరోగ్యంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది. దీంతోపాటు ఆమె విట‌మిన్ డిని నిత్యం తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాల‌పై ఇత‌ర సైంటిస్టుల‌తో క‌లిసి అధ్య‌య‌నాలు చేస్తోంది.

Breast Cancer

తాజాగా జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం విట‌మిన్ డి కి ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించే గుణం ఉంద‌ని తెలిసింది. అయితే ఇలా జ‌ర‌గాలంటే ర‌క్తంలోని సీర‌మ్ లెవ‌ల్స్‌ను త‌ర‌చూ ప‌రీక్ష చేయించి అందులో ఉండే విట‌మిన్ డి మోతాదును ప‌రీక్షించాలి. సాధార‌ణంగా 40 ng/ml మోతాదులో విట‌మిన్ డి ఉంటే చాలు. ఇది క్యాన్స‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంద‌ట‌. 16 ర‌కాల క్యాన్స‌ర్‌ల‌ను త‌గ్గించే గుణం విట‌మిన్ డికి ఉంది. శ‌రీరంలో విట‌మిన్ డి త‌గిన మోతాదులో ఉంటే అది క్లోమం, ఊపిరితిత్తులు, అండాశ‌యం, రొమ్ము, ప్రోస్టేట్‌, చ‌ర్మం వంటి క్యాన్స‌ర్ల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తుంద‌ట‌.

రోజూ కొంత స‌మ‌యం పాటు శ‌రీరంలోని దాదాపు 50 శాతం భాగానికి సూర్య‌కాంతి సోకేలా చూస్తే చాలు. ఆ రోజుకి స‌రిప‌డా విట‌మిన్ డి మ‌న‌కు అందుతుంది. దీంతోపాటు చేప‌లు, పాలు, గుడ్లు, తృణ ధాన్యాలు, వంకాయ‌లు, ప‌సుపు, వెల్లుల్లి, బ్ర‌కోలి, గోధుమ గ‌డ్డి, ట‌మాటా త‌దిత‌ర ఆహార ప‌దార్థాల్లోనూ మ‌న‌కు విట‌మిన్ డి ల‌భిస్తుంది. ఇది క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను 77 శాతం వ‌ర‌కు తగ్గిస్తుంది. అదేవిధంగా డ‌యాబెటిస్ వంటి ఇత‌ర అనారోగ్యాల నుంచి కూడా మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది.

క్యాన్స‌ర్‌కు వ్య‌తిరేకంగా పోరాడ‌డంలో విట‌మిన్ డి అమోఘంగా ప‌నిచేస్తుంది. ఈ నేప‌థ్యంలోనే రొమ్ము క్యాన్స‌ర్‌ను విట‌మిన్ డి లోపం వ‌ల్ల వ‌చ్చే వ్యాధిగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో పేర్కొంటున్నారు. అంటే విట‌మిన్ డిని నిత్యం తీసుకుంటే ఈ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు 90 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయి. విట‌మిన్ డి శ‌రీరంలో త‌గిన మోతాదులో ఉంటే క్యాన్స‌ర్లు రావ‌ని పైన తెలుసుకున్నాం క‌దా. అయితే ఇదే విష‌య‌మై 2007లో జోన్ ల్యాప్‌, రాబ‌ర్ట్ హీనీ అనే ఇరువురు ప‌రిశోధ‌కులు రీసెర్చి కూడా చేశారు. మెనోపాజ్ ద‌శ‌లో ఉన్న కొంత మంది మ‌హిళ‌ల‌కు నిత్యం త‌గినంత మోతాదులో విటమిన్ డి ఇచ్చారు. 4 ఏళ్ల పాటు ఇలా వారి ప‌రిశోధ‌న కొన‌సాగింది. అనంతరం తెలిసిన విష‌య‌మేమిటంటే ఆ మ‌హిళ‌ల్లో ఉన్న క్యాన్స‌ర్ కార‌క క‌ణాలు దాదాపు 77 శాతం వ‌ర‌కు త‌గ్గాయ‌ట‌. అయితే సీర‌మ్‌లో 50 నుంచి 70 ng/ml మోతాదులో విట‌మిన్ డి ఉంటే క్యాన్స‌ర్ క‌ణాల‌పై మ‌రింత మెరుగ్గా పోరాడేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

విట‌మిన్ డి లోపం వ‌ల్ల క్యాన్స‌ర్లు వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అనేక ప్ర‌యోగ‌శాల‌ల్లో చేసిన ప‌రిశోధ‌న‌ల్లోనూ వెల్ల‌డైంది. అయితే కేవ‌లం విట‌మిన్ డి ఉన్న ఆహారం తీసుకోవ‌డం మాత్ర‌మే కాకుండా నిత్యం వ్యాయామం, త‌గినంత నిద్ర‌, స‌రైన వేళ‌కు భోజ‌నం చేయ‌డం వంటివి అల‌వాటు చేసుకుంటే క్యాన్స‌ర్ల‌పై మరింత స‌మ‌ర్థ‌వంతంగా పోరాడ‌వ‌చ్చ‌ని తెలిసింది. సాధార‌ణంగా వ‌చ్చే రొమ్ము క్యాన్స‌ర్‌ను 100 శాతం వ‌ర‌కు పూర్తిగా న‌యం చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. శ‌రీరంలోని క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేయ‌డం ద్వారా విట‌మిన్ డి ఆ వ్యాధి నుంచి మ‌న‌కు ర‌క్ష‌ణ‌నిస్తుంది. సో, ఇప్ప‌టి నుంచైనా విట‌మిన్ డి ఉన్న ఆహారం అధికంగా తీసుకోండి. త‌ర‌చూ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుని క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గించుకోండి.

Share
IDL Desk

Recent Posts

ఈ ఫుడ్ తింటే ఊపిరితిత్తులు నెల రోజుల్లో పూర్తి ఆరోగ్యంగా మారుతాయి..!

మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్య‌మైన‌వో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…

Monday, 23 September 2024, 5:22 PM

రోడ్డుపై కుక్క‌లు మిమ్మ‌ల్ని వెంబ‌డిస్తే ఆ స‌మ‌యంలో ఏం చేయాలి అంటే..?

ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మ‌రింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…

Saturday, 21 September 2024, 3:01 PM

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM