Mother And Child : తల్లి కావాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. దీన్ని అనేక మంది మహిళలు అదృష్టంగా కూడా భావిస్తారు. ఇక తమ కల నెరవేరి నిజంగా గర్భం దాల్చితే ఆ ఆనందానికి హద్దులు ఉండవు. ఈ క్రమంలోనే గర్భంతో ఉన్న మహిళలు పుట్టబోయే తమ బిడ్డ ఆరోగ్యం పట్ల అమితమైన శ్రద్ధ వహిస్తారు. అయితే గర్భంతో ఉన్నప్పుడే కాదు, బిడ్డకు జన్మనిచ్చిన తరువాత, వారు పాలు మరిచేంత వరకు తల్లులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిడ్డ పుట్టిన తరువాత తల్లులు తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన వాటిలో తల్లిపాలు కూడా ఒకటి. ఈ విషయంలో తల్లులతోపాటు తండ్రులు కూడా వైద్యుల సలహాను తప్పనిసరిగా తీసుకోవాలి. డాక్టర్ సూచనల మేరకు తల్లిపాలను క్రమం తప్పకుండా అందించాలి. గర్భంతో ఉన్నప్పుడు ఎలాగైతే విటమిన్లు, మినరల్ ట్యాబ్లెట్లు తీసుకుంటారో అదే విధంగా బిడ్డ జన్మించిన తరువాత కూడా కొనసాగించాలి. డాక్టర్ చెప్పేంత వరకు లేదా బిడ్డ పాలు మరిచేంత వరకు ఈ ట్యాబ్లెట్లను తీసుకోవడం మానకూడదు. బిడ్డ జన్మించిన తరువాత సాధారణంగా తల్లులు ఎక్కువ ఒత్తిడి, అలసటకు లోనవుతుంటారు. ఇలాంటి సమయంలో ఇతరుల సహాయం తీసుకోవాలి.
డెలివరీ అనంతరం తల్లి ఎల్లప్పుడూ బిడ్డతో ఉంటుంది. ఈ సమయంలో టెన్షన్, ఆందోళనకు గురి చేసే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయి. వీటిని విడుదల చేసే గ్రంథులు కిడ్నీలపై ఉంటాయి. ఇవి కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో తల్లుల్లో సహజంగానే తమ బిడ్డ పట్ల ఆందోళన ఏర్పడుతుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం లేదా ఇతరుల సహాయం తీసుకుంటే దీని నుంచి బయట పడవచ్చు. గర్భధారణ అనంతరం బిడ్డ డెలివరీ అయ్యే వరకు తీసుకున్న పౌష్టికాహారాన్ని బిడ్డ జన్మించిన అనంతరం కూడా కొనసాగించాలి. ఎందుకంటే పాలిచ్చే తల్లుల ద్వారా ఆ పౌష్టికాహారంలోని పోషకాలు బిడ్డకు లభిస్తాయి. కాబట్టి బిడ్డ పాలు మరిచేంత వరకు పౌష్టికాహారం తీసుకోవడం మానకూడదు.
డెలివరీ అనంతరం బిడ్డ సంరక్షణ సమయంలో ఒత్తిడి మరీ ఎక్కువగా ఉంటే డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు వెళ్లాలి. దీంతో సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుంది.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…